చోలే - బ్రెడ్ ఛాట్
ఛాట్ ఐటమ్స్ ఏవైనా సరే అందరం ఇష్టంగా తింటాము.చోలే, బ్రెడ్
కలిపి చేసే ఈ ఛాట్ వెరైటీగా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
చోలే రెండు కప్పులు
బ్రెడ్ నాలుగు స్లైసులు
ఉల్లిపాయలు రెండు
మిర్చి మూడు
ఆలూ రెండు
టమాట రెండు
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
చోలే మసాల ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర ఒక కట్ట
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
సన్నకారప్పూస కొద్దిగా
నూనె రెండు టేబుల్ స్పూన్స్
ఛాట్ మసాల అర టీ స్పూన్
నిమ్మరసం ఒక టీ స్పూన్
జీలకర్ర పావు స్పూన్
కరివేపాకు ఒక రెమ్మ
తయారు చేసే విధానం:
శనగలను నానబెట్టుకోవాలి.
నూనె వేడిచేసి జీలకర్ర,కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి
దోరగా వేయించాలి .
ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి,ఆలూ ముక్కలు,శనగలు
వేసి కలపాలి.
రెండు నిముషాలు వేయించి,ఉప్పు,కారం,పసుపు,వేసి కలిపి టమాట
ముక్కలు కూడా వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి పాన్ మూత పెట్టెయ్యాలి.
ఆరేడు విజిల్స్ రానిస్తే శనగలు మెత్తగా ఉడుకుతాయి,
స్టీం పోయిన తరువాత తీసి చోలే మసాల ,కొత్తిమీర వేసి కూర
చిక్కబడేదాక ఉడికించుకోవాలి.
ఈలోగా బ్రెడ్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేయించి
తీసుకోవాలి.లేదా నెయ్యి,వెన్న వేసి తవాపై కూడా టోస్ట్ చేసుకోవచ్చు
కానీ క్రిస్ప్ గా ఉండాలి.
ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఒక ప్లేట్లో పెట్టి పైన చోలే కూర వేయాలి.కొన్ని
బ్రెడ్ ముక్కలు పైన కూడా వేయాలి.
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,కొంచెం ఛాట్ మసాల చల్లి,
నిమ్మరసం వేసి పైన సన్న కారప్పూసతో అలంకరిస్తే నోరూరించే ఛాట్
రెడీ అవుతుంది.