ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BEET ROOT CONTROLS THE BLOOD PRESSURE - TRY IT


రక్తపోటు నియంత్రణకు బీట్‌రూట్‌

అన్నీ శక్తి కోసమే కాదు కొన్ని ఆహార పదార్థాలు శక్తినివ్వటమే కాకుండా ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ప్రకృతి సహజమైన ఆహార పదార్థాల్లోంచే మన ఎన్నో రుగ్మతల్ని నయం చేసే ఔషధాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. కానీ, ఆ విలువల గురించి మనకు తెలియాలి కదా! ఆ తెలియాలంటే వాటి మీద పరిశోధనలు జరగాలి. హైపర్‌ టెన్షన్‌ అనే పత్రిక జరిపిన అధ్యయనంలో నైట్రేట్‌ సమృద్దిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉంది. అందు వల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్దిగా ఉన్న కూరగాయలు ఆకుకూర లు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.