ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANCE OF SRAVANA MASAM MANGALA GOWRI VRATHAM


‘శ్రావణ మాసం’ మంగళ గౌరీ వ్రతం
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి
పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు – అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.