ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GREEN VEGETABLES - PALAK / PALAKURA REDUCES THE CHANCE OF ATTACKING HEART ATTACK AND HEART PROBLEMS


పక్షవాతాన్ని, గుండె జబ్బులున్ని , తగ్గించే పాలకూర
**
పక్షవాతం వచ్చే రిస్క్ ను నివారించే విషయం లో పాలకూర సమర్ధవంతం గా పనిచేస్తుందని చైనీస్ శాస్త్రవేత్తలు నిరూపించారు.పాలకూర లోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జరుగుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.మరీ ముఖ్యం గా హైపర్ టెన్షన్స్ వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ నివారిస్తుందని ,పాలకూర లో ఇది పుష్కలం గా ఉంటుందని వారు పేర్కుంటున్నారు. హైబీపి ఉన్న 20702 మంది ఫై నిర్వహించిన ఆదధ్యయనం లో తేలింది.వీళ్ళంతా హైబీపి ని తగ్గించే ఎనాల్రపిల్ అనే మందును వాడుతున్న వారే.వీరికి మందు తో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్కువుగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్ ల లో ఆహారాన్ని అందించారు.అయితే క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ ను తీసుకుంటున్న వారిలో స్ట్రోక్ వచ్చేందుకు అన్ని విధాల రిస్క్ ఉన్న వారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయన వేత్తలు గుర్తించారు.పైగా దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయం గా తగ్గాయి.ఈ పరిశోధన ఫలితాలను . ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్ ‘ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి