ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Grapes Health Tips. Show all posts
Showing posts with label Grapes Health Tips. Show all posts

DRY FRUITS - DRY GRAPES CONTROLS HIGH BLOOD PRESSURE - HEALTH BENEFITS WITH DRY GRAPES


హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే ఎండు ద్రాక్
ఎండుద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్‌ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్‌ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి.

వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. క్రీడాకారులు తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటే.. ఎండుద్రాక్షల్ని తీసుకోవడం మంచిది. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్‌, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.వీటితో మరికొన్ని ఆరోగ్య ప్రయోజ

హైబిపి , క్యాన్సర్ తగ్గిస్తాయి.. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి.

క్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్‌ బి కాంప్లెక్‌‌స, ఐరన్‌ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌ సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది.

మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినుటవలన మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. కిస్‌మిస్‌ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్‌ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్‌మిస్‌ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రి రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది.

రక్త హీనతకు వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం.

GRAPE FRUITS HEALTH BENEFITS


ద్రాక్ష... ఆరోగ్యానికి రక్ష! 
మధురమైన రుచితో కూడిన ద్రాక్షలో ఎన్నో ఔషధగుణాలూ దాగిఉన్నాయి. అందుకే వీటిని ఆహార నిపుణులు సూపర్‌ఫుడ్‌గా అభివర్ణిస్తున్నారు. వీటిల్లోని పాలీఫినాల్స్‌ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు, ఈ పాలీఫినాల్స్‌ బీపీ తగ్గేందుకూ తోడ్పడతాయట. అయితే ఎర్రద్రాక్ష తొక్కలో ఉండే రెస్‌వెరాట్రల్‌ అనే పాలీఫినాల్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే క్యుయెర్సెటిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెవ్యాధుల్ని నివారిస్తుందట. అధికంగా ఉండే పొటాషియం, పీచూ కూడా గుండెపనితీరుకి దోహదపడతాయి. ఇంకా క్యుయెర్సిటిన్‌వల్ల కొన్ని రకాల అలర్జీలు కూడా తగ్గుముఖం పడతాయని తేలింది. వారానికి మూడుసార్లయినా ద్రాక్షపండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల మధుమేహ వ్యాధికి కూడా దూరంగా ఉండొచ్చు అంటున్నారు. పైగా వృద్ధాప్యంలో చక్కెర వ్యాధితో వచ్చే రెటీనా సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు, ఆల్జీమర్స్‌ వ్యాధినీ మెనోపాజ్‌ సమయంలో తలెత్తే భావోద్వేగ హెచ్చుతగ్గులనూ ఇవి నియంత్రిస్తాయి.

GRAPES GIVES PROTECTION FROM ULSER - TIPS IN TELUGU


నీరసాన్ని తగ్గించే ద్రాక్ష

 ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదులో చెక్కర వుంటుంది. అందుకే నీరసంగా ఉన్నపుడు ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.

ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున 48 రోజులపాటు తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుంది.