ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Dasaradhi Satakam Poems Collection. Show all posts
Showing posts with label Dasaradhi Satakam Poems Collection. Show all posts

DASARADHI SATAKAM - SRI RAMADASU POEMS COLLECTION



దాశరథీ శతకం -- రామదాసు

తరువులు పూచికాయలగు దుత్కసుమంబులు పూజగా భవ
చ్చరణము సోకి దాసులకు సారములౌ ధనదాన్యరాశులై
కరి భట ఘోటకాంబర నికాయములై విరజానదీ సము
త్తరణమొనర్చు చిత్రమిది దాశరధీ కరుణాపయోనిధీ !

భావము :
దశరధపుత్రా కరుణా సముద్రా రామా ! చెట్లు పూలు పూచి ఆ పూలు కాయలుగా మారును. ఆ పూవులు కోసి పూజకై నీ చరణములు సోకిన నీ భక్తులకు ధన ధాన్యములు, చతురంగబలములు ఏర్పడి విరజా నదిని దాటించును. అటులనే నన్ను కుడా ఈ సంసారమను విరజా నదిని దాటింపుము.