ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Lion Dates Health Tips. Show all posts
Showing posts with label Lion Dates Health Tips. Show all posts

HEALTH BENEFITS OF DATES - KHAJUR


ఖర్జూరాల గురించి..

ఖర్జూరాలను king of ప్రొటీన్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. 

 పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడుతాయి. గర్భణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది.

రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.

HEALTH BENEFITS WITH KARZOORA / LION DATES IN SUMMER 2016


ఖర్జూర పళ్ళు తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.
ఎండు ఖర్జూరాలు
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.
పవిత్రఫలంమహిళలు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణు లంటున్నారు. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయుసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది.
ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్‌ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఎంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతుంది.
ప్ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్‌ అని పిలిచే ప్లేవనాయిడ్‌ పాలిఫీనాలిక్‌ యాంటీఆక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తసవ్రాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్‌ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది.
ప్వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి వాటిని నివారిస్తుంది.

HEALTH BENEFITS WITH LION DATES


ఖర్జూరం లో ఉండే విటమిన్లు, A,C,B1.B2 లు ఉంటాయి
పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది
ఎముకలకు మంచిది 
BP ని అదుపులో ఉంచే అనేక ఆహారఅంశాల్లో ఖర్జూరం ఒకటి
అత్యధిక శాతం లో ఐరన్ ఉంటుంది కాబట్టి అనీమియా రాకుండా అరికడుతుంది