ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Digestion Health Tips. Show all posts
Showing posts with label Digestion Health Tips. Show all posts

HEALTHY TIPS FOR GOOD DIGETION IN TELUGU


పొట్ట ఉబ్బరం , అజీర్ణం & గ్యాస్ సమస్యలకు సోంపు గింజలు

1) సోంపు గింజలు పొట్ట ఉబ్బరం , గ్యాస్ సమస్యలు , అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి.
2) ఒక స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి గోరువెచ్చగా తీసుకోవాలి.
3) పొట్ట ఉబ్బరంగా , గ్యాస్ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే రెండు పూటలా భోజనం చేసాక తీసుకోవాలి.
4) గ్యాస్ సమస్యలతో ఉన్నవారు పులుపు , కారం , మసాలాలు , జంక్ ఫుడ్ తగ్గించాలి.
5) వేళకు భోజనం చేసి , వేళకు నిద్రపోవాలి. కనీస వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.

DIGESTION HEALTH TIPS WITH JEERA - SOMPU - PATIKA BELLAM


జీర్ణశక్తిని పెంచే సోంపు -జీరా -పటికబెల్లం మిశ్రమం తయారీ విధానం.
కావలసినవి 
25 గ్రాములు సోంపు గింజలు 
25 గ్రాముల జీలకర్ర 
25 గ్రాముల పటికబెల్లం (మిశ్రి)
తయారీ విధానం
ముందుగా , జీలకర్ర , సోంపు గింజలు ఒక గిన్నెలో నూనె వెయ్యకుండా దోరగా వేయించుకోవాలి.తర్వాత ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి .పటికబెల్లం కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మూడింటిని భాగా కలిపి ఒక సీసా లో నిల్వ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం
మద్యాహ్నం , రాత్రి బోజనం తిన్న వెంటనే ఒకటి నుండి రెండు స్పూన్ల పౌడర్ చప్పరించాలి.ఈ పౌడర్ జీర్ణ శక్తి ని పెంచుతుంది.