ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Indian Traditions and Beliefs. Show all posts
Showing posts with label Indian Traditions and Beliefs. Show all posts

ANNAM PARABRAHMA SWAROOPAM BY ARUNA SRI


*అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా*

*కొన్ని నిజాలు చూద్దాం*

అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని 
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు.

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు.

*తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.

*బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.

*టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు.
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.
ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.

భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

IMPORTANCE OF SINDHOOR AND RANGOLI IN HINDU WOMEN'S LIFE - ARTICLE BY ARUNA SRI


మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టు కి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది.

బొట్టులేని ముఖము, ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.


కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత

ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,
దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే..
శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.
అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.
కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు.
నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు
మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.
మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.
ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.
ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన 
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
అంటే మెదడుకు సంభందించినటు
వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.
కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే 
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు 
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.
జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎతువంటి ఒత్తిడికి 
లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.
సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.
అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.
ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ 
కూడా తొలగిపోతాయి.
అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.
ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.
పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైరవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.
ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు.
ఆ బొట్టును వైరవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.
మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన యొక్క ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే 
హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము.
ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.

BRIEF MEANING OF INDIAN TRADITIONAL MARRIAGE


వివాహంలో మంగళ సూత్రధారణ పరమార్ధం ఏమిటి ?

రెండు తాళి బొట్లు గౌరి శంకరులకు ప్రతీకలు . మంగళ సూత్ర ధారణ క్షణం నుంచి నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుష్షు తో ఆ దంపతులు కలసి ఉండాలని మంగళ సూత్రధారణ పరమార్ధం . దీని లో ఇంకొక అర్ధం అటు అత్త వారిల్లు , ఇటు పుట్టినిల్లు సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని చెప్పటం .