ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Ancient Indian Yoga tips. Show all posts
Showing posts with label Ancient Indian Yoga tips. Show all posts

HEALTH BENEFITS WITH INDIAN YOGA - VAJRASANAM


వజ్రాసనం ఆరోగ్య రహస్యం

శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం ఏదైనా ఉందంటే అది వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రాయుధం లా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది

1. మలబద్దక నివారిణి: మన శరీరంలో అవయవాల మీద ఒత్తిడిని కలిగించే ఆసనం ఇది. ఈ ఆసనం యొక్క భంగిమ ఆబ్డామిన్(పొత్తికడుపు), పొట్ట మరియు ప్రేగుల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది మరియు దాంతో మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
 వజ్రాసనంతో ఇది ఒక గొప్ప ప్రయోజనం 

2. ఒత్తిడి తగ్గిస్తుంది: మోకాళ్ళ మీద కూర్చోవడం వల్ల మీ వెన్ను మరియు కాళ్ళు కొంచెం సాగదీదకు గురిచేస్తుంది. ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడిలను తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ విశ్రాంతి చెంది, స్ట్రెస్ ఫ్రీగా మారుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే మోకాళ్ళ మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేసేప్పుడు, మీ కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. వజ్రాసన భంగిమ వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం, మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు. వజ్రాసన వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం.
3. వ్యాధులను నివారిస్తుంది: కొన్ని వ్యాధులను చాలా సులభంగా తగ్గించడంలో వజ్రాసనం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.