ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Watermelon Health Tips. Show all posts
Showing posts with label Watermelon Health Tips. Show all posts

BEAUTY TIPS FOR WOMEN USING WATERMELON - HEALTH AND BEAUTY TIPS WITH WATERMELON - SEASONAL FRUIT


కమిలిన చర్మానికి పుచ్చకాయ!

ఈ కాలంలో పుచ్చకాయలు విరివిగా దొరుకుతుంటాయి. దాహాన్ని తీర్చి... శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుందీ ఫలం. పుచ్చకాయ ఆరోగ్యానికే కాదు... అందానికీ ఎంతో మేలు చేస్తుంది.

* ఎండన పడి తిరిగి ఇంటికి వచ్చాక చర్మం అలసిపోయి.. కళ తప్పుతుంది. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ ముక్కల్ని మెత్తగా మెదిపి.. ముఖానికి మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో అలసిన చర్మానికి చల్లదనంతోపాటూ సాంత్వనా లభిస్తుంది.

* వేసవిలో చర్మం కమిలిపోతుంది. అలాంటి వారు పుచ్చకాయ గుజ్జు, కీరదోస గుజ్జును సమపాళ్లలో తీసుకుని... పూతలా వేసుకోవాలి. తరవాత కడిగేస్తే... చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

* రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా పెరుగు చేర్చాలి. ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కున్నాక ఈ గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే.. కళ తప్పిన చర్మం కాంతిమంతంగా మారుతుంది. పొడిబారిన చర్మానికి ఈ పదార్థాలు రెండూ తేమనందిస్తాయి.

* రెండు చెంచాల పుచ్చగుజ్జులో చెంచా తేనె చేర్చాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే.. చర్మం మృదువుగా మారుతుంది.

* గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి.. అందులో నాలుగైదు చెంచాల పుచ్చకాయ రసం చేర్చి ఐస్‌ట్రేలలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐసుముక్కలుగా మారాక వాటిని బయటకు తీసి చర్మం మీద మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల తెరుచుకున్న గ్రంథులు మూసుకుపోయి.. చర్మం నునుపుదేలుతుంది.

SUMMER COOLING TIPS WITH WATERMELON


పుచ్చకాయతో లాభాలెన్నో

ఏ పండులో లేని విధంగా ఇందులో నీటి శాతం ఎక్కువ. దాంతో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాలు పనిచేయక ఇబ్బంది పడేవారు ఈ పండును తినకపోవడం మంచిది. కానీ మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారు, మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది. అలాంటపుడు అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. అన్ని రకాల జ్వరాలకు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులను తడిగా ఉంచుతుంది.