ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label TELUGU KIDS VIDEOS. Show all posts
Showing posts with label TELUGU KIDS VIDEOS. Show all posts

WATER - MILK


పాలు – నీళ్ళు

కథ వినండి

అనగా అనగా ఒక రాజు. ఆ రాజు గారికి తన అధికారం మీద చాలా నమ్మకం. తన శాసనాలను ప్రజలు తు. చ. తప్పకుండా పాటిస్తారని అనుకునే వాడు. మంత్రి మణివర్మ రాజు గారి నమ్మకాన్ని పరీక్షిద్దామని అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు.
ఒక రోజు రాజ్యంలో ఇలా దండోరా వేయించారు, “ఈ రోజు చీకటి పడిన తర్వాత, నగరంలోని ప్రజలందరూ రాజ భవనం ముందు ఉన్న కొలనులో ఒక కుండెడు పాలు పొయ్యవలసిందని రాజు గారి ఆజ్ఞ.”
ప్రజలకు రాజు గారి ఆజ్ఞ వింతగా తోచింది. ప్రతి ఒక్కరూ మనసులో, ” నగరంలో ప్రజలంతా రాజు గారికి భయపడి పాలు తెచ్చి పోస్తారు. నేను ఒక్కడినీ నీళ్ళు పోస్తే రాజు గారికి తెలియదులే. పాలలో నీళ్ళు కలిసిపోతాయి,” అనుకుని తలా ఒక కుండెడు నీళ్ళు తీసుకు వచ్చి కొలనులో పోశారు.
తెల్ల వారి రాజు గారు వచ్చి చూస్తే కొలను నిండా నీళ్ళే ఉన్నాయి, ఒక్క చుక్క కూడా పాలు లేవు!
  • అధికారం – authority
  • శాసనం – command or order, inscription
  • పరీక్ష – test, examination
  • DIWALI FESTIVAL VIDEOS FOR TELUGU CHILDREN


    దీపావళి


    దీపావళి పండగ దీపాల పండగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
    దీపావళి రోజు బాణా సంచా కూడా కాలుస్తారు.
    ఈ పండుగ అక్టోబరు లేదా నవంబరు నెలలో వస్తుంది.
    తెలుగు క్యాలెండరు ప్రకారం, ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు.
    అంతకు ముందు రోజు, అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు, నరక చతుర్దశి అంటారు.
    ఆ రోజు శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అంటారు.
    అప్పుడు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారట.
    దీపావళి రోజు బాణాసంచా కూడా కాలుస్తారు.
    చిచ్చుబుడ్లూ, మతాబులూ, కాకరపువ్వొత్తులూ, భూచక్రాలూ, విష్ణు చక్రాలూ రంగు రంగుల వెలుగులని విరజిమ్ముతాయి.
    టపాకాయలూ, సిసింద్రీలూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాయి.
    దీపావళి ప్రార్థన

    COLOURS COLOURS TELUGU STORY AND POETRY


    రంగులు


    నవ్వే రంగులు కాబోలు విచ్చుకున్న పువ్వుల రేకులు

    రంగులకే రెక్కలొస్తే అవుతాయేమో అవి సీతాకోకచిలుకలు

    రాలే ముందు ఆకులు రంగులతో ఆడుకుంటాయేమో మరి

    వాన చినుకులలో విడిపోయిన ఏడు రంగులు వాన విల్లై వంగుతాయి

    WATER KNOWS DOWN FALL AND GOD KNOWS THE EXACT TRUTH - TELUGU KIDS SPECIAL


    నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు


    కరిగి కరిగి మంచుగడ్డ ముక్కగా మిగిలిందట

    నీటి విత్తనమనుకుని దానిని నేలలో నాటారట

    మొత్తం కరిగి కళ్ళముందే అది మాయమైతే

    దానికోసం తవ్వి తవ్వి మొదటి బావి కనుగొన్నారట.