The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Diabetes Health Tips. Show all posts
Showing posts with label Diabetes Health Tips. Show all posts
TOP NINE EFFECTIVE TIPS FOR CONTROLLING SUGAR TO DIABETES PATIENTS
షుగర్ వ్యాధిగ్రస్తులకు 9 పవర్‌ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్..!
డయాబెటిస్… నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భయపెడుతున్న జబ్బు ఇది. దీని బారిన ఏటా మన దేశంలో 64 కోట్ల మంది పడుతున్నారు. టైప్-1, టైప్-2 ఏదైనా రెండింటి వల్ల రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ రెండింటికీ ట్రీట్‌మెంట్లు కొద్దిగా వేరేగా ఉంటాయి. టైప్-1 కు ఇంజెక్షన్లు ఇస్తే, టైప్-2కు టాబ్లెట్లు ఇస్తారు. ఈ క్రమంలో ఏ తరహా షుగర్ వ్యాధి వచ్చినా దానికి వైద్యులు ఇచ్చే మందులతోపాటు కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే దాంతో షుగర్ గణనీయంగా అదుపులోకి వస్తుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
tips-for-diabetes-1
1. దాల్చిన చెక్కకు రక్తంలోని చక్కెరను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ తరహా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్కను ఎలా వాడాలంటే… దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీటర్ నీటిలో వేసి మరిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మరిగాక వచ్చే ద్రవాన్ని వడకట్టి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తాగాలి. దీంతో కేవలం కొద్ది రోజుల్లోనే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.
2. టైప్-1 డయాబెటిస్‌ను సమర్థవంతంగా నయం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జరిపిన పలు అధ్యయనాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
3. వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ రకమైన రసాయనం సమృద్ధిగా ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇది వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే పచ్చిగా తింటుంటే దాంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
4. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు కరివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔషధ కారకాలు డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందుగా గుప్పెడు కరివేపాకు ఆకులను తింటే దాంతో చక్కెర వ్యాధి నయం అవుతుంది.
5. జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీలకర్ర పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఆ నీటిని మరిగించాలి. అలా నీరు అరగ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్రవాన్ని వడకట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగర్ వెంటనే అదుపులోకి వస్తుంది.
tips-for-diabetes-2
6. ఉదయాన్నే పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
7. మీఠీ పత్తి అని పిలవబడే ఓ మొక్క ఆకులు కూడా బ్లడ్ షుగర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని సహజ సిద్ధమైన తీపి పదార్థంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు కూడా. దీంతో షుగర్ స్థాయిలు పెరగవు సరి కదా, పైగా ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోకి వస్తాయి. దీన్ని 2011లో పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఈ మొక్కకు చెందిన పొడి కూడా మనకు మార్కెట్‌లో లభ్యమవుతోంది.
8. బీట్‌రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తింటున్నా షుగర్ వ్యాధిని అదుపులోకి తేవచ్చు.
9. పొడపత్రి ఆకు చూర్ణం నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అర గంట ముందు నీళ్లలో కలిపి తాగాలి. దీని వల్ల కూడా షుగర్ గణనీయంగా అదుపులోకి వస్తుంది.
DIABETES HEALTH TIPS - HOW TO REDUCE SUGAR EFFECT ON HUMAN BODY
తీపి తగ్గించుకునేలా..!
ఈమధ్య తీపిపై అందరూ జాగ్రత్తపడుతున్నారు. ముఖ్యంగా చక్కెర తగ్గించాలని తీర్మానాలూ చేసుకుంటున్నారు. కానీ ఎంత అదుపులోపెట్టుకున్నా.. ఒక్కోసారి తీపిపై ఆశ పోదు.
అలాంటప్పుడు ఇవి పాటించండి..!
తీపి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ అందుతుంది. శీతలపానీయాలూ, బ్రెడ్డూ, కెచప్‌లలో ఇలా రకరకాల ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకున్నప్పుడు వాటిలో ఉంటుంది. కాబట్టి కొనేటప్పుడే వాటిలో చక్కెర శాతం ఎంతో చూసుకోండి. తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోండి.
* టీ, కాఫీల్లో చక్కెం తప్పనిసరే. కానీ ఎప్పుడూ వాటినే తాగాలని లేదు. తరచూ గ్రీన్ టీ వంటివి ఎంచుకుంటూ అప్పుడప్పుడూ కాఫీ, టీలూ తీసుకోండి. వీటివల్ల బరువు పెరుగుతారనే ఇబ్బంది కూడా ఉండదు.
* తీపి కావాలని మనసు కోరుతున్నప్పుడల్లా ఫ్రూట్ సలాడ్ వంటివి తినాలి. పండ్ల వల్ల శరీరానికి సహజ చక్కెర అందుతుంది. దాంతోపాటూ పీచు కూడా దొరుకుతుంది. యాలకులూ, లవంగాలూ, దాల్చిన చెక్క వంటివి నోట్లో వేసుకుని చప్పరించాలి.
* కొందరికి ఈ కాలంలో ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలనిపిస్తుంది. అలాంటివారు పండ్ల రసాలూ, కాచి చల్లార్చిన పాలూ, కాస్త తేనె కలిపి ఐస్ ట్రేలలో పోయాలి. అందులో ఒక టూత్ పిక్ ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. గడ్డకట్టాక ఐస్ ఫ్రూట్‌లా తినేయొచ్చు.

Subscribe to:
Posts (Atom)