ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Telugu Love Poetry - Prema Kavithalu. Show all posts
Showing posts with label Telugu Love Poetry - Prema Kavithalu. Show all posts

GORU VECHANI GUNDELLO NEE CHALLANI MAATALE



ఈ పాట చాల మంది గాయకులూ పాడారు ఎవరి ప్రత్యేకత వారిదే .. 
భావం గుండెని.. కదిలించి .. పిల్ల తెమ్మరలా మనసును కుదిపేస్తుంది 

గోరు వెచ్చని గుండెలో... నీ చల్లని మాటలే
గోరు వెచ్చని గుండెలో... నీ చల్లని మాటలే
పైరు పచ్చని సంధ్యలో నీ కమ్మని పాటలే 

ఆ నోట, ఆ నోటా.. నీ తలపుల ఊసులే .. 
ఆ నోట, ఆ నోట.. నీ తలపుల ఊసులే ..
ఏ చోటా, ఏ వేలా.. నిన్ను తలిచే మనసులే .. 

ఏ వయిపున చూపు మరలిన .. నీ వలపుల తోటలే 
ఏ వయిపున... చూపు మరలిన నీ వలపుల తోటలే 
పైరు పచ్చని సందెలో... నీ కమ్మని పాటలే 
గోరు వెచ్చని గుండెలో... నీ చల్లని మాటలే

మరలు సందెల గాలి దారుల .. నిన్ను వెతికే చూపులే 
మరలు సందెల గాలి దారుల .. నిన్ను వెతికే చూపులే 
మరపు రాని.. మరువలేని.. పాట నీ చిరునవ్వులే 
మనసు మనసున పొంగి పొరలేను నీ నవ్వుల తేటలే ..
మనసు మనసున.. పొంగి పొరలేను.. నీ నవ్వుల తేటలే ..
పైరు పచ్చని సందెలో.. నీ కమ్మని పాటలే 

గోరు వెచ్చని గుండెలో... నీ చల్లని మాటలే
పైరు పచ్చని సంధ్యలో నీ కమ్మని పాటలే 

గోరు వెచ్చని గుండెలో... నీ చల్లని మాటలే

WOMEN BEAUTY POETRY IN TELUGU


మల్లె పూల నగవది మత్తునే జల్లులే !
కల్లలేని మనసది కరుణనే జూపులే !
నల్ల కలువ కనుగవ నటనలే జేయులే !
విల్లు వంటి నడుమది విస్తులే గొల్పులే !
పిల్ల పలుక దొలకును ప్రేమభరిత సుధలూ !
వెల్లు వెత్తి యురుకును విరిసేటి మమతలూ !

చిన్న దాని నడకా చిలుకు హృదిని పగలే !
వన్నె లాడి విరుపూ వలపు లొలుక సెగలే !
యెన్న లేని సొగసది ఎదను తడుము కవనం !
పొన్న పూ సోయగం పులకించు ను నయనం !
చిన్ని చిన్ని పెదవులు సిగ్గులిడు మదనాలు !
కన్నె వన్నె పరువము కవ్వించు కవనాలు !

ద్విరదగతి రగడ :
.................... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

PREMA LOKAM


ప్రేమ లోకాలలో మధుర భావాలలో
పొంగి పోరలేనులే నింగికెగసెనులే
ఆధారాలలో మధువందుకో
చిగురకుల వణుకెందుకో
సుడిగాలిలా చెలరేగిపో 
ఝడి వానలా తడిపేసిపో
భాష తెలిపేందుకే
బెదురు చూపుందిలే
వయసు తెలిపేందుకే
మనసు మనకుందిలే
కాలమేంతైననూ కరిగిపోయేనుగా
భావ మేమున్నదో తెలిసిపోయేనులే
రాగ భావాలతో కలిసి పోదాములే
మధుర హస్తాలతో మురిసి పోదాములే . ( క్రిష్ )