ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Telugu Village Songs. Show all posts
Showing posts with label Telugu Village Songs. Show all posts

OLD SAVARA JANAPADHALU


పాత సవర జానపదాలు

TELUGU FOLK SONGS - SANTHANTE SANTHOSHAM - OLD TELUGU WOMEN VILLAGE SONGS COLLECTION


తెలుగు వాంగ్మయం స్త్రీ సారస్వతం 

THOLI VALAPU BEAUTIFUL SONG IN TELUGU WRITTEN BY BHANGARU MAMA SONGS SRI KONAKALLA VENKATARATNAM


తొలివలపు.!
(బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం.)
.
వలచీనాడమ్మా
మనసు
కలచీనాడమ్మా
దారంట మగఠీవి
తారసిల్లును దినము!
కాలి ధూళిగ మారి
రాలిపోయిన చాలు!
వలచీ...
గుండెలోతులు దొలిచే
గోరువెచ్చని వాని
వాలుకన్నులలోన
కాలిపోయిన చాలు!
వలచీ...
మాటలోపల యేదో
మంత్రమున్నదె! వాని
కవుగిట్లో కడసారి
కన్నుమూసిన చాలు!
వలచీ...
పాటపాడితె చాలు
తోట పులకించేను!
వింటూనె ప్రాణాలు
విడచీన చాలమ్మ!!
వలచీ..

TELUGU LOVERS SONG


ఏలే ఏలే మరదాలా.!
.
బావా మరదళ్ళ సరస సల్లాపాల యుగళ గీతం! 
.
అచ్చ తెలుగు పదాల అందమైన పొందికలో జానపదుల గుండెల్ని పరవశింపచేసే రీతిలో 
రచన చేసిన అన్నమయ్య భావుకతకు జోహార్లు అర్పించవలసిందే.
.
.
ఏలే ఏలే మరదలా
చాలు చాలు చాలును
చాలు నీతోడి సరసాలు బావ
గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
చీటికి మాటికి చెనకేవు వట్టి
బూటకాలు మాని పోవే బావ
అందిందె నన్ను అదిలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో తిరిగేవు సటకారి ఓ బావ
పొందుకాదిక పోవే బావా
చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగువైతి బావ.!

ANDHRA VILLAGE WOMEN SEEMANTHAM SONG IN TELUGU


పుట్టింటికి పురిటి కొచ్చింది పిల్ల. ఆమె వైభోగాన్ని చూడండి
.
(దామెర్ల రామారావు గారి చిత్రం.)
"ఎవరాడబడుచమ్మ - ఎవరాడబడుచు?
యేరు దాటొచ్చింది ఎవరాడబడుచు?
కుచ్చులా పల్లకిని కూర్చున్నదీ - లోన
అచ్చంగ రాణిలా అమరున్నదీ!
పరుపు బాలీసుపై ఒరిగున్నదీ!
అన్నలైతే పసిడి అందెలిస్తారు
తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు
పెట్టి పోసేవారు పుట్టింటివారు
పుట్టింటికే తానూ పురిటి కొచ్చింది!
లక్ష్మి[పురిటికొచ్చిన పిల్ల]: అందుకు కాదమ్మోయ్ నేను వస్తా!
సుబ్బమ్మ: అదెంత సేపమ్మోయి పిల్లా!
మరదళ్ళు అడుగులకు మడుగు లొత్తేరు
వదినల్లు కనుసన్న నొదిగి మెదిలేరు
గౌరవానికి గాని ఘనతకు గాని
తన పుట్టింటిలో తాను దొరసాని!
అబ్బాయి తాతయ్య అంక మెక్కెను
అమ్మాయి అమ్మమ్మ చంక నెక్కెను
తన పుట్టింటిలో తాను దొరసాని
మగనింటిలో ఉంటె మగువ యువరాణి!
[దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి 'ఏడాది పొడుగునా' అనే రూపకము లోని కొంతభాగం]

TELUGU VILLAGE SONG - CHAL MOHANA RANGA - TELUGU JANA PADHA GEETHALU



జన పద గీతం.
.
.చల్ మోహనరంగా... నీకు నీ వారు లేరు నాకు నావారు లేరు
ఏతి ఒడ్డున ఇల్లు కడదాము పదరా 
చల్ మోహనరంగా నీకు నాకు జోదు కలిసెను గదరా 
మల్లె తోటలోన మంచి నీళ్ళ బావి కాద ఉంగరాలు మరిచి వస్తిని కదరా ||చల్ మోహనరంగ|| కంటికి కాతుకేట్టీ కడవా సంకాన బట్టి
కంటి నీరు కడవ నింపితి గదరా ||చల్ మోహనరంగ||
గుట్టు దాటి ప్పుట్టదాటి - ఘనమైన అడవిదాతి
అన్నిదాటి అడవి బడితిమి కదరా ||చల్ మోహనరంగ||
నీకి నాకు జోడు అయితే -
మల్లెపూలా తెప్పగట్టీ త్ర్ప్పమీద తేలిపోదము పదరా ||చల్ మోహనరంగ||
అదిరా నీ గుండెలదరా - మధురా వెన్నెల రేయి
నిదరాకు రమ్మంటిని కదరా ||చల్ మోహనరంగ||