ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Lord Sri Ayyappa Swamy Stories and Articles. Show all posts
Showing posts with label Lord Sri Ayyappa Swamy Stories and Articles. Show all posts

Pathinettampadi (18 divine steps) to the sanctum sanctorum of lord ayyappa


Pathinettampadi (18 divine steps) to the sanctum sanctorum is divine in all aspects. Every Ayyappa devotee, before he sees the Sanctum Sanctorum, has to lay his footsteps over eighteen sacred steps. Initially the 18 steps were made of granite. It was later covered with Panchaloha (a special composition of gold, silver, copper, iron and tin), in the year 1985 to prevent it from deterioration. Pilgrims initiate their ascent up the Pathinettam Padi by placing their right foot on the first step. As per the tradition, only those who undertake the penance for 41 days and those who carry the irumudi on their head are allowed to use the steps.

The first five steps symbolise the five human senses (Panchendriyas) i.e. visual (vision), auditory (hearing), olfactory (smell), gustatory (taste) and tactile (touch). These signify the `mortal’ nature of one’s body. The next eight steps symbolise the eight Ashtaragas viz, Kama, Krodha, Lobha, Moha, Madha, Maltsarya, Asooya, Dhumb (Love, Anger, Avarice, Lust, Pride, Unhealthy Competition, Jealousy and Boastfulness). The next three steps stand for three Gunas or Thrigunas (nature-born qualities) i.e. Satva, ( perspicuity, discernment) , Rajas (activity, enjoyment) and Thamas (inactivity, stupor). The last two steps represent Vidya (Knowledge) and Avidya (Ignorance).

It is assumed that after climbing up these eighteen steps reverently, one symbolically detaches oneself from all the worldly ties that bind one physically and mentally to the world. It is only then that a person will be in a receptive condition to be ‘one’ in consonance with the concept of ‘The Ultimate Creator’.
The above are the most prevalently accepted version of the significance of the Holy 18 steps. Other versions are as follows: Ayyappa was a master of 18 weapons and the steps signify these. Ayyappa before merging into the idol at the Sanctum Sanctorum, surrendered his 18 weapons, one at each step of Pathinettam Padi.

MEANING OF SWAMI AYYAPPA


అయ్యప్ప స్వామి చరిత్ర !
అయ్యప్ప (Ayyappa) హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.
అయ్య (=విష్ణువు),
అప్ప smile emoticon శివుడు)
అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

AYYAPPA DEEKSHA - HEALTH BENEFITS


అయ్యప్పదీక్షతో ఆరోగ్యం 

స్వామి అయ్యప్ప దీక్షలో ఆరోగ్య రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. తెల్లవారు జామున బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, చన్నీటి తలస్నానం చేయడం వలన రాత్రివేళ చంద్రకిరణాలు, నక్షత్రకాంతి నీటికి సోకడం వలన నీరు స్వచ్చంగా పవిత్రంగా ఉండి ఉత్సాహాన్ని కలుగజేస్తుంది.

తెల్లవారుఝామున చేసే స్నానాన్ని దేవతా స్నానంగా పేర్కొంటారు. స్నానపు గదిలో స్నానం కన్నా నదీ స్నానం లేక బావివద్ద చేసే స్నానం శ్రేష్ఠం. ప్రవహించే నీరు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

తడిచేసిన విభూదిని నుదుటిపై అలంకరించు కోవడం వలన శరీరంలో విద్యుత్ ప్రవహించి నూతన శక్తి వస్తుంది. విభూది, చందనం, కుంకుమ ధరించడం వలన ముఖ వర్చస్సు పెరుగుతుంది. మనసు పవిత్రంగా నిర్మలంగా ఉండడానికి దోహదపడుతుంది.

ముఖక్షవరం చేసుకోకుండా గెడ్డాన్ని పెంచుకోవడం వలన శరీరంపై మమకారం తగ్గుతుంది.

అహంకారాన్ని దూరం చేస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల శబరిమల యాత్రలో అడవులలో కొండలపై సులువుగా నడవడానికి పాదాలు మొద్దుబారి అలవాటు పడతాయి. పాదాలలో రాళ్ళు, రప్పలు వంటివి గుచ్చుకోవడం పాదాలలో వున్నా కొన్ని నాడులు (ఆక్యుప్రెషర్) ఉత్సాహాన్ని కలిగించి మనకు తెలియకుండానే భక్తి పారవశ్యానికి లోనవుతాము.

ప్రతిరోజూ రెండుపూటలా స్నానానంతరం దీపారాధన చేసి పూజ చేయడం వలన అయ్యప్పస్వామి శరణాలు ఉచ్చరించడం వల్ల ఆధ్యాత్మిక చింతన అలవడి భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తుంది. తరచూ దేవాలయ సందర్శన, సంత్సంగం, భజనల వల్ల భక్తి భావం పెరిగి మనసంతా నిర్మల చిత్తంతో నిండిపోతుంది. ఉదయం వేళ, సాయంత్రం వేళ రోజూ దేవాలయాలకు, భజనలకు నడచి వెళ్లి రావడం వల్ల తెలియకుండా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసినట్లవుతుంది.

బ్రహ్మచర్య వ్రతం వల్ల బుద్ధిబలం, మనోబలం, దేహబలం పెరుగుతుంది. బ్రహ్మచర్యం వలనే దేహబలంతో ఆంజనేయుడు, బుద్ధిబలంతో నారదుడు మనకు ఆరాధ్యదైవాలయ్యారు. నేలమీద చాపపై నిద్రించడం వలన వెన్నుపూస, దేహము గట్టిపడి, శరీరం స్వాధీనంలో వుండి పర్వతారోహణ సులువుగా చేయడానికి దోహదపడుతుంది.

ఏకభుక్తము సాత్వికాహారము మితంగా భుజించడం వల్ల శరీరము తేలికగా వుండి ఉత్సాహంగా యాత్రలో నడవడానికి తోడ్పడుతుంది. మితంగా ఆహారము ఒక క్రమ పద్ధతిలో శుచి, శుభ్రత పాటించి సకాలంలో తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ బయట ఆహారాన్ని తినకపోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. మద్యమాంసాదుల జోలికి పోకుండా, పోగాగ్రాగడం, జూడమాడడం వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల రోగాలు దరికి చేరావు. దీక్షలో కొందరు కాఫీ, టీలు కూడా విసర్జించి పళ్ళు పాలు మాత్రమే స్వీకరించడం వల్ల ధృడంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు.

STORY ABOUT LORD AYYAPPA - SABARIMALA VISISTHATHA - SWAMIYE SARANAM AYYAPPA


శబరి మళ విశిష్టత

‘స్వామియే శరణం అయ్యప్ప’ 

అంటూ... ఆంధ్రదేశం మారుమ్రోగుతోంది. ఏటేటా అయ్యప్ప దీక్షాదారుల సంఖ్యపెరుగుతూ... కార్తీక మాసారంభంలో జోరందుకున్నాయి.‘శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం’ అంటూ భక్తులు అచంచల భక్తితో... అత్యంత కఠినమైన నియమనిష్ఠలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్షను చేపడుతున్నారు. ఆ మణికంఠుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీరుస్తూనే ఉన్నాడు. దానికి ఏటేటా పెరుగుతున్న కన్నెస్వాములే ప్రత్యక్షనిదర్శనం...అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుం డా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడ మే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే మన రాష్ర్టంలోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది.ఏటేటా అయ్యప్ప దీక్ష తీసు కునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దీక్షలు సాధారణంగా కార్తీక మాసంతో ప్రా రంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతాయి. అయ్యప్ప దీక్షా పరులు నలు పు/కాషాయం రంగుల్లో దుస్తులు ధరించి 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్విహస్తూ తరిస్తున్నారు. దీక్ష తీసుకున్న స్వా ములు ప్రతి ఒక్కరిని దేవుడి ప్రతి రూపంగా భావిస్తూ ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ నామాన్ని జపిస్తుంటారు. దీక్ష వల్ల మనఃశ్శాం తి, క్రమశిక్షణ ధార్మిక భావాలు పెంపొందుతా యంటారు గురుస్వాములు.
దీక్ష నియమాలు...
అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునేస్వాములు ముందుగా 108 తులసి లేదా రుద్రాక్షలతో అయ్యప్ప స్వామి ప్రతిమను కలిగిన మాలను అల్లించుకోవాలి.నల్ల బట్టలు, మాల తీసుకుని సమీపంలోని అయ్యప్ప దేవాలయాల్లో గురు స్వామితో కానీ ఆలయ అర్చకులతో కానీమాలధారణ చేయించుకోవాలి. మాల మెడలో పడిన క్షణం నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. నల్ల బట్టలు, నుదుట గంధం బొట్టు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ప్రతివారి ని అయ్యప్ప స్వామి ప్రతి రూపంగా భావించి ‘స్వామి’ అని సంబోధించాలి.ప్రతి రోజు సూ ర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీళ్లతో శిరస్నానం చేయాలి. ఉద యం, సాయంత్రం వేళల్లో స్వామి వారికి పూజలు నిర్వహించాలి. ఒక పూట భోజనం చేసి రాత్రి పూట అల్పాహారం లేదా పాలు, పళ్లు మాత్రమే తీసుకోవాలి. కటిక నేల మీద నిద్రించాలి. దీక్షా కాలంలో క్షుర కర్మలు చేయడంగాని, వేలి గోర్లను తీయడంగాని చేయకూడదు. ఆడవారిని తోబుట్టువులుగా,తల్లిగా భావించాలి. కోపతాపాలకు, అశుభ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ దైవరాధన చేస్తూ ప్రశాంత జీవనం గడపాలి. 41 రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల యాత్రను పూర్తి చేయాలి. శబరియాత్ర పూర్తి చేసి ఇంటికి చేరిన తర్వాత తల్లితోకానీ, భార్యతో కానీ లేదా దేవాలయ అర్చకుల చేత మాల విరమణ చేయించుకోవాలి.పడి పూజ...
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు తమ దీక్షా కాలంలోమెట్ల పూజ (పడిపూజ) నిర్వ హించి కనీసం ఐదుగురు స్వాములకు భిక్ష (భోజనం) లేదా అల్పాహారం పెట్టడం ఆనవా యితీ. పడిపూజ నిర్వహించాలనుకున్న వారు అరటి బోదెలతో మండపం నిర్మిస్తారు. అందు లో అయ్యప్ప స్వామి చిత్ర పటాన్ని ఏర్పాటు చేస్తారు. శబరిమల దేవాలయం వద్ద ఉన్నట్లు గా 18 మెట్లను తయారు చేసి, ఒక్కో మెట్టు ను ఒక్కో దేవుడి ప్రతి రూపంగా భావించి మె ట్ల పూజ నిర్విహస్తారు. మెట్ల పూజలో భాగం గా అయ్యప్ప స్వామికి వివిధ రకాల అభిషేకా లు నిర్వహిస్తారు. పడిపూజలో స్వాములు పాల్గొని భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.
దీక్షతో ఆరోగ్యం...
అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకుఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్లమెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భృగు మధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్ల దనాన్ని ఇవ్వడమే గాక గంధం సువానస మానసిక ప్రశాంతతనిస్తుంది.వనమూలికల తో తయారయ్యే విభూతి యాంటీబాక్టీరియల్‌ గాపనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది. దీక్షా కాలంలో ధరించే నలుపు రంగు బట్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తా యి. కాళ్లకు చెప్పులు ధరించకుండా నవడవ డం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మ ట్టి గడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకుని ఓ రకంగా ఆక్యూపంక్చర్‌ చర్య జరిగి నరాల కు స్పందన కలుగుతుంది. దాంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.ఒం టి పూట భోజనం చేయడం వల్లజీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి అత్మస్థైర్యం,ఏకాగ్రత పెంపొందుతాయి.అయ్యప్పకు కన్నెస్వామి అంటే ప్రీతి.

అయ్యప్ప దీక్షను పురుషులు ఏ వయసు లో ఉన్నా కుల, మత భేదం లేకుండా తీసు కోవచ్చు. అమ్మాయిలైతే పదేళ్ల లోపు వారు, మహిళలైతే 55 ఏళ్ల పైబడ్డ వారు మాత్రమే దీక్ష తీసుకునేందుకు అర్హులు. మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని కన్నె స్వాములుగా, రెండవ సారి తీసుకున్న వారిని కత్తి స్వాములుగా, మూ డవ సారిగంట స్వాములుగా, నాల్గవ సారి గద స్వాములుగా, ఐదవ సారికి గురుస్వా ములుగా పిలుస్తారు. వీరందరిలో కన్నె స్వాములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఏటా ఒకరిద్దరు కొత్త వ్య క్తులతో దీక్ష చేపట్టించి తమ వెంట శబరి మలకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే మహా ఇష్టమని ప్రతీతి.
యాత్ర అంత కష్టమా ?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలా మంది జంకుతారు. ఎందువల్ల? ఈ ప్రశ్న కు చాలామందికి తెలిసిన జవాబు అది అ త్యంత కఠినతరమని. ఇదొక్కటి మాత్రమే కాదు, వారు శబరిమల యాత్ర తప్పనిసరి గా చేయాలి. నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని, శబరి మల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలా మందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది.నిజానికి శబరిమలయాత్ర అంత కష్టమా? అంటే కాదనే చెప్పాలి. దైవం పై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో ముందుకు వస్తే అలాం టి భయాలేవీ ఉండవు. పిల్లలు, వృద్ధ స్ర్తీలు, వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాల కు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడ కన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకురాకపోవడానికి అసలై న కారణం సంకల్ప లోపం. వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆ ధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించు కుంటూ వెళుతుంది.దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీ దే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరి నీ వదిలి అడవి మార్గంలో బయలుదేరుతా రు.
నియమాలు, నిష్ఠల విషయంలో ఏ మే రకు క్రమశిక్షణను పాటిస్తామన్న దాని పైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండా నే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయ పడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్న వారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.
పదునెట్టాంబడి విశిష్టత...
శ్రీ అయ్యప్ప సన్నిధానంలోని పదునెట్టాం బడి (పదునెనిమిది మెట్లు) ఎక్కడాన్ని భక్తు లు అదృష్టంగా భావిస్తారు. మెట్లను దేవ తలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. 18 మెట్లకు 18 విశిష్టతలు ఉన్నాయి.
1వ మెట్టు అణిమ
2వ మెట్టు లఘిమ
3వ మెట్టు మహిమ
4వ మెట్టు ఈశత్వ
5వ మెట్టు వశత్వ
6వ మెట్టు ప్రాకామ్య
7వ మెట్టు బుద్ధి
8వ మెట్టు ఇచ్ఛ
9వ మెట్టు ప్రాప్తి
10వ మెట్టు సర్వకామ
11వ మెట్టు సర్వ సంవత్కర
12వ మెట్టు సర్వ ప్రియాకార
13వ మెట్టు సర్వ మంగళాకార
14వ మెట్టు సర్వ దుఃఖ విమోచన
15వ మెట్టు సర్వ మృత్యువశ్యమణ
16వ మెట్టు సత్యవిఘ్న నివారణ
17వ మెట్టు సర్వాంగ సుందర
18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయక
37 ఏళ్లుగా నిరాటకంగా మాలధారణరామగుండం ఎన్టీపీసీలో కేరళ రాష్ట్రానికి చెందిన కొందరు పని చేస్తుండేవారు. అయ్యప్ప దీక్ష తీసుకుని వారు చేసే పూజా కార్య క్రమాలు, భజనలను చూసి నేను ఆకర్షితుడనయ్యాను. మళయా ళీల ప్రోత్సాహంతో అయ్యప్ప దీక్షను మొట్టమొదటిసారిగా 1974 లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా 37 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి సేవలో తరిస్తున్నాను. అయ్యప్ప దీక్షలో ఉన్న మధురానుభూతి మరే దీక్షలో ఉండదనేది నా అభిప్రాయం. మన కోసం... మన కుటుంబం కోసం తీసుకునేదే అయ్యప్ప దీక్ష. దీక్షలో మనసా... వాచా... కర్మణా స్వామిని ధ్యానిస్తూ దీక్షను పరిపూర్ణం గావించాలి. దేహాన్ని కొబ్బరికాయగా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియ ఈ అయ్యప్ప దీక్షలో ఉన్న విశిష్టత.అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలుఅయ్యప్ప దీక్ష కఠిన నియమాలతో కూడు కున్నది. ఎంత నియ మ నిష్ఠలతో ఉంటే అంత సులువుగా శబరియాత్ర చేయ వచ్చు. అయ్యప్ప దీక్షలో కుల మత భేదం, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ని భగ వంతుడి స్వరూపంగా భావించాలి. 20 ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో ఉండే అయ్యప్ప దీక్షాపరులు నేడు వేల సంఖ్యకు చేరుకున్నా రు. ప్రతి యేటా అయ్యప్ప దీక్ష లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉం ది. మిగతా ప్రాంతాల్లో కంటే మన రాష్ట్రం లోనే అయ్య ప్ప దీక్షను నియమ నిష్ఠలతో చేపడతారు.దీక్ష ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిందిఅయ్యప్ప దీక్ష ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది అయ్య ప్ప దీక్ష తీసుకుని వ్యసనాలకు దూరమయ్యారు. తమ జీవితంలో వచ్చిన మార్పుతోప్రతి యేటా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ స్వామి సేవలో తరిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్షాపరులు దేవాలయంలో చేసిన పూజలు, భజనలకు ఆకర్షితుడనై స్వామి దీక్ష తీసుకున్న నేను నిరాటంకంగా 16 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. నా కుటుంబంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని స్వామి సన్నిధానానికి తీసుకెళ్లాను. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా స్వామి సన్నిధానాన్ని దర్శించుకుంటే అంతకు మించిన మహాభాగ్యం లేదు.దీక్షతోనే నా జీవితం మలుపు తిరిగింది.అయ్యప్ప దీక్షతోనే నా జీవితం మలుపు తిరి గింది. 13 ఏళ్ల క్రితం నా కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉండేది. అయ్యప్ప దీక్ష తీసుకు న్న నేను ఆ తర్వాత జీవితంలో వెనక్కి తిరి గి చూడలేదు. స్వామి దయ వల్ల ఆర్థిక స మస్యలన్నీ తీరిపోయాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశం వెళ్లిన నేను అక్కడ దీక్ష తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ దీక్షా సమయంలో ఎలా ఉండేవాడినో అక్క డ కూడా ప్రతి సంవత్సరం మాల, నల్లబట్ట లు ధరించకుండానే నియమనిష్ఠలతో అ య్యప్ప స్వామిని ధ్యానించేవాడిని. స్వామి దయ వల్ల ఆర్థికంగా ఎదిగిన నేను స్వామి వారి ఆలయ అభివృద్ధి ఇతోధికంగా సా యం చేస్తున్నాను. మున్ముందు కూడా సా యం చేస్తాను. దీక్షతీసుకోవడం వల్ల నా జీ వితంలో వచ్చిన మార్పును ప్రతి ఒక్కరికి చెబుతూ దీక్ష తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నాను.
- రాపర్తి రమేశ్‌, గురుస్వామి
ఇరుముడి...
అయ్యప్ప దీక్షలో ప్రాచుర్యం, పవిత్రత కలిగి ఉండేది ఇరుముడి. ఇరుముడి రెండు భాగా లను కలిగి ఉండి యాత్ర కోసం తలపై ధరిం చేందుకు వీలుగా ఉంటుంది. ఇరుముడిలో ఒభాగంలో పూజా ద్రవ్యాలు, మరో భాగం లో ఆహార ధాన్యాలు, ఆవు నెయ్యితో నింపిన కొబ్బరి కాయను ఉంచుతారు. శబరిమల అయ్యప్ప దేవాలయం ముందు ఉన్న పదు నెట్టాంబడి ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉన్న వారినే అనుమతిస్తారు. దేవాలయానికి చేరు కున్న భక్తులు ఇరుముడిలోని కొబ్బరి కాయ లో నింపిన నెయ్యితో మూల విరాట్టుకు అభిషే కం జరిపిస్తారు. కొబ్బరి ముక్కలను ఆలయ ప్రాంగణంలోని హోమ గుండంలో వేస్తారు. ఇరుముడిలోని ఆహార ధాన్యాలతో భోజనం వండుకుని తింటారు. దేహాన్ని కొబ్బరికాయ గా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియగా ఈ ఇరుముడికి ప్రత్యేకత ఉంది.
శబరిమలై యాత్రలో దర్శనీయ స్థలాలు...
అయ్యప్ప భక్తులు వీలును బట్టి అచ్చన్‌ కోవిల్‌, అరయంగావు, కుళుత్తుపులలో ఉండే అయ్యప్ప దేవస్థానాన్ని దర్శించి పందళ రాజ నివాస స్థలం చూసి ఎరుమేలి చేరుతారు.
ఎరుమేలి...
శ్రీ అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు, సేవకుడైన వావరుస్వామి వెలసి ఉన్న దివ్య స్థలం ఇది. దీ నినే ‘కొట్టైప్పడి’ అని కూడా పిలుస్తారు. మణి కంఠునిచే సంహరింపబడ్డ మహిషి... తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకు విసిరివేయబడింది కాబట్టి ఈ ప్రాంతానికి ‘ఎరు మ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమ ‘ఎరుమేలి’గా మారింది.ఎరుమేలి చేరిన భక్తులు వయోభేదాన్ని లెక్కించకుండా ఎంతో సంతోషంగా తమ శరీరాలను ఆకులు, కూరగాయలు, పళ్లు, రంగు రంగుల కుంకుమలు, బుడగలతో అలంకరించుకుంటారు. చెక్కతో చేయబడిన చాకు, బాకు, బాణం, గద మొదలైన ఆయుధాలను ధరించి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా ‘స్వామి దింతకతోమ్‌... అయ్య ప్ప దింతకతోమ్‌’ అంటూ నాట్యం చేస్తారు. ఈ నాట్యాన్ని ‘పేటైతులాలు’ నాట్యం అంటా రు. యుద్ధ సమయంలో స్వామి మహిషిపైకి ఎక్కి ఈ నాట్యం చేశాడని భక్తుల నమ్మకం. దానికి గుర్తుగా భక్తులు ఈ న్యాటాన్ని నేటికీ ఆచరిస్తున్నారు.నాట్యం చేసుకుంటూ స్వామి వారి భక్తుడైన వావరు స్వామిని మొదటగా దర్శించుకుని అక్కడ విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు.వావరు స్వామి ముస్లిం భక్తుడైనా అయ్యప్ప స్వాములు తమ యాత్రలో కుల, మత భేదాన్ని పాటించరు. వావరు స్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప (పేటశాస్తా) ఆలయాన్ని దర్శించుకుని తావళం చేరుకుంటారు. అక్కడి స్నాన ఘట్టాల్లో స్నాన మాచరిస్తారు. పెరియా పాదం (పెద్ద పాదం) నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడి నుంచే తల పై ఇరుముడిని ఎత్తుకుని శరణాలు పలుకు తూ పెరియా పాదయాత్రను ప్రారంభిస్తారు.చిన్న పాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబాకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు.
పెరూర్‌తోడు...
ఎరుమలై నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి ‘పెరూర్‌ తోడు’ చేరతారు. ఇక్కడ చిన్నవాగు దారికి అడ్డంగా ప్రవహిస్తుంది. వీర మణికంఠుడు పులి పాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు భక్తులు నమ్ముతారు. పెరూర్‌ తోడు నుంచి ముందుకు ఉన్న అడవి ప్రదే శాన్ని ‘పూంగా’ వనమని అంటారు. పూంగా వనమంటే పూలతోట అని అర్థం.
కాళైకట్టి...
భక్తులు పెరూర్‌తోడు దాటి 12 కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కాళైకట్టి చేరుతారు. మణికంఠుడు మహిషి పైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చి ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని అందుచేత ఈ స్థలానికి ‘కాళైకట్టి’ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు.ఆళుదా నది...
కాళైకట్టి దాటి 5 కిలో మీటర్లు నడిచి ఆళుదా నది చేరుతారు. ఇది పంపానదికి సమానమైన పుణ్య నది. చక్కని ప్రకృతి, సంతోషం కలిగిం చే పరిసరాలు, గలగలమని సాగే నిర్మల నీటి ప్రవాహంతో యాత్రికులకు మనోహరం కలి గించే ప్రదేశం. భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం ఆళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు.ఆళుదామేడు...
ఆళుదానది నుంచి ప్రారంభమైన కొండను ఆళుదామేడు అంటారు. ఇది చాలా ఎత్తైన ఏటవాలు కొండ. ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. కాలు జారితే పాతాళమే. చుట్టూ దట్టమైన అడవిలో తిరిగే మృగాలను చూడవచ్చు. భక్తులు శరణాలు ప లుకుతూ, ఆ స్వామి అండతో ఈ కొండను ఎ క్కుతారు. ఆళుదామేడు శిఖరం సముద్ర మ ట్టం నుంచి 4 వేల అడుగుల ఎత్తులో ఉండ టం చేత వాతావరణం చల్లగా ఉంటుంది.
కరిమలై...
కరిమలై తూడు దాటిన భక్తులు కరిమల కొం డ ఎక్కడం ప్రారంభిస్తారు.కరిమల ఎక్కడం కష్టం.. కష్టం అని మనం అయ్యప్ప భక్తి గీతా లలో వింటూ వుంటాం. దానిని బట్టి కరిమల ఎక్కడం ఎంత శ్రమతో కూడుకున్నదో ఊహిం చవచ్చు. అయ్యప్ప స్వాములు 41 రోజులు కఠోర దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది.శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యం. కరిమలై అంటే కరి (ఏను గుల) కొండ అని అర్థం. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా సూర్య కిరణాలు భూమిపై పడనంత దట్టమైన అటవీ ప్రాంతం.ఇక్కడ శ్రీ గంధం, ఎర్ర చందనం చెట్లు విస్తారంగా ఉం టాయి. ఇక్కడ ఏనుగు, పులి, చిరుతపులి మొ దలైన అడవి జంతువులు కనిపిస్తాయి. కరిమ లై కొండ మీద ఒక బావి ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తుల నీటి అవసరాన్నితీర్చడానికి బాణం వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి. ఈ బావి ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంది. కరిమలై వంకర టింకరలతో కూడిన కాలిబా టలో ఏడు భాగాలుగా పైకి ఎక్కాలి. కరిమలై లో కరిమల నాథస్వామి, కరిమలై అమ్మన్‌ పేర్లతో ఆలయాలు ఉన్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష సరిగా చేయకున్నా, భక్తితో శరణా లు పలుకకున్నా ఈ అమ్మవారు భక్తులను దం డిస్తుందంటారు.
సిరియాన వట్టమ్‌.. పెరియాన వట్టమ్‌..
భక్తులు కరిమల దిగిన తర్వాత సిరియాన వట్టమ్‌ (చిన్న ఏనుగు పాదం) పెరియాన వట్ట మ్‌ (పెద్ద ఏనుగుల పాదం) ద్వారా తమ యా త్రను ముందుకు సాగిస్తారు. ఇక్కడ ఏనుగులు తిరుగుతూ వుంటాయి కనుక ఈ ప్రదేశాని కి ఆ పేర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 3 కి.మీ. పయనిస్తే పంబానదికి చేరుకుంటారు.
పంబానది...
పంబానది గంగానదితో సమానమైన పరమ పవిత్రమైన స్నాన ఘట్టం. పంబానదికి ఎడమ పక్క వాలి చేత తరుమబడ్డ సుగ్రీవుడు తన అ నుచరులతో తల దాచుకున్న పురాణ ప్రసిద్ధ మైన ముకాచలం ఉంది. రామభక్తుడైన హను మంతుడు పుట్టినది, భక్త శబరి రామ దర్శనా నికి వేచి ఉన్నది ఇక్కడే. సీతాన్వేషణ చేస్తున్న శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు మొదటి సారిగా కలుసుకున్న ప్రాంతమిది. సీతను ఎ త్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంత వర కు పోరాడిన జటాయువుకు శ్రీరాముడు అగ్ని సంస్కారాలు చేసి తర్పణాలు వదిలింది ఇక్కడే.మాతంగ మహాముని ఆశ్రమం ఉండేది ఇక్కడ నే. అందుచేతనే గంగానదితో సమానంగా
పంబా నదిని భావిస్తూ తమ పితృ దేవతలకు అక్క డ తర్పణాలు విడిచి పెడతారు. చాలామంది భక్తులు పంబానదిలో దీపాలను వెలిగించి దీపోత్సవం చేస్తారు. పంబానదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్వచనీయమైన అనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమ ను మరిచిపోతారు. ఇది అయ్యప్ప భక్తులందరి కీ అనుభవపూర్వకమైనది. ఇరుముడి వెనుక ముడిలోని ఆహార పదార్థాలను ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు. దీనినే ‘పంబాసద్దె’ అని అంటారు. పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసి ఆర్పబడిన 108 పొయ్యిలలోని బూడిదను సేకరించి దానికి వస్తక్రాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు.
గణపతి సన్నిధానం...
పంబా నదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడులను తలపైనెత్తుకుని పంబానది తీ రం నుంచి మెట్ట మీదుగా గణపతి సన్నిధానం చేరుతారు. అక్కడ మెట్లు ఎక్కే భక్తులను ఆ జన ప్రవాహాన్ని చూస్తుంటే హృదయం పులకి స్తుంది. కడలి తరంగాల వలే కదిలేటి జనులు అనే అయ్యప్పభక్తి గీతం జ్ఞప్తికి వస్తుంది. గణపతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికాయ కొట్టి గణపతిని, శ్రీరాముడు, హను మంతుడు, దేవీ ఆలయాలను దర్శిస్తారు.
శబరి పీఠం...
అప్పాచ్చిమేడు దాటి ప్రయాణిస్తే చిన్న గుడి కనబడుతుంది. ఇది శ్రీరాముడు శబరిని కలి సిన చోటు. శ్రీ రాముడిని సమగుణుడుగా ప్రీ తించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు. ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన అమెకు శ్రీ ధర్మశాస్తా మోక్షాన్ని కలుగజేశాడు. శబరి జ్ఞాపకార్థం ఇప్పుడొక రాయి మాత్రమే ఇక్కడ ఉంది. శబరిని తలచుకుని భక్తులిక్కడ కొబ్బరికాయ కొడతారు. శరణాలు చెబుతారు.
శరంగుత్తి...
శబరిపీఠం నుండి కొంచెం ముందుకు వెళితే శరంగుత్తి చేరవచ్చు. శ్రీ అయ్యప్ప స్వామి, ఆ యన పరివారం ఇక్కడ గల శరంగ చెట్టు (మర్రిచెట్టు)కు తమ ధనుర్భాణాలను గుచ్చినట్లు పురాణగాథ. కన్నె స్వాములు తాము ఎరుమేలిలో కొన్న బాణాలను ఇక్కడ గుచ్చుతారు. అప్పుడే వారు పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులు.
పదునెట్టాంబడి...
పరిసరాలను చూస్తూ వరుసలో నిల్చున్న భ క్తులు మొదట దేవస్థానం వారు కట్టించిన విరి క్యూలైన్లలో నడిచిన తర్వాత పదునెట్టాంబడి చేరతారు. మెట్ట మార్గంలో కిందనున్న వెలి యకడుత్త స్వామి, కరూపమ్మ కరూత్త స్వాము లకు నమస్కరించి పక్కగానున్న గోడకు కొబ్బ రి కాయ కొట్టి శరణాలు పలుకుతూ మెట్టకు మొక్కుతూ ఆనందోత్సాహలతో పదునెట్టాంబ డి ఎక్కుతారు. భక్తులు ఈపదునెట్టాంబడినిదేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు.ధ్వజ స్తంభం...
పదునెట్టాంబడి దాటగానే ఎదురుగా ధ్వజస్తం భం కనబడుతుంది. ఇది పూర్తిగా బంగారు రేకులతో అతికించబడి ఉంది. ధ్వజ స్తంభం చి వరన బాణం గుర్తు ఉంటుంది. మణికంఠుడు పందళరాజుకు యోగ దృష్టితో ఆలయ నిర్మాణానికి స్థలం చూపించిన బాణానికి గుర్తుగా భ క్తులు నమ్ముతారు. సూర్య కిరణాలు ఈ ధ్వజ స్తంభంపై పడి స్వర్ణ కాంతులు విరజిమ్ముతాయి.
సన్నిధానం...
ధ్వజ స్తంభం దాటిన తర్వాత స్వామి దర్శనా నికి కాంక్రీటు డాబాపై చుట్టూ క్యూ లో ఒక ప్రదక్షిణ చేయాలి. అప్పుడు స్వామి సన్నిధానంలో నిలిచే అదృష్టం కలుగుతుంది. పున్నమి నాటి చం ద్రుని ముఖారవిందంతో, యోగాసన ధారియై తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్న శ్రీ ధర్మశాస్తా దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం వర్ణణాతీతం.శబరిమలైలో ముఖ్య సేవలు...
స్వామి సన్నిధానంలో నవంబర్‌ 16 లేక 17 తేదీలలో ప్రారంభమై 41 రోజులు డి సెంబర్‌ 26 లేక 27 తేదీల వరకు మండల ఉత్సవం జరుగుతుంది. దీనికి మొదలు పదు నెట్టాంబడికి పూజలు చేస్తారు. పడి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మకర సంక్ర మణ ఉత్సవం జనవరి 1 నుంచి 20 వరకు జరు గుతుంది. ఆగస్టు - సెప్టెంబర్‌ మాసంలో వచ్చే ఓనమ్‌ ఉత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహి స్తారు. ఏప్రిల్‌లో విషు పూజ జరుపుతారు.
స్వామి వారి తిరువాభరణాలు...
మకర జ్యోతి కనిపించే ముందు స్వామి వారి కి తిరువాభరణాలు అలంకరించడం సంప్రదా యంగా వస్తోంది. మూడు అలంకృతమైన పెట్టెలలో వజ్ర కిరీటం, బంగారు కడియాలు, స్వామి ఖడ్గంతో పాటు అనేక వజ్ర వైఢూర్యా లుఉంటాయి. పందళ రాజవంశం వారి ఆధీ నంలోనే ఈ అమూల్యమైన అభరణాలు ఉం టాయి. మకర సంక్రాంతికి రెండు రోజుల ముందుగా పందళ రాజ వంశీయులు దేవ స్థానం బోర్డు అధికారులకు తిరువాభరణాలు అప్పగిస్తారు. ఈ అభరణాలు మొదట శబరి మలైకి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంద ళలోని వెలియ కోయికెల్‌ ధర్మశాస్తా ఆలయం లో ఉంచి పూజలు చేస్తారు.
మకర విళక్కు ఉత్సవం...
మకర జ్యోతి కనిపించిన రాత్రి సన్నిధానంలో మకర విళక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రారంభం నుంచి ఏడు రోజుల పాటు చేస్తారు.

THE BIRTH HISTORY OF LORD SRI AYYAPPA SWAMY IN TELUGU


అయ్యప్పస్వామి.

అయ్యప్ప (Ayyappa) హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య  విష్ణువు), అప్ప  శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.

అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
మహిషి కథనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి - సోమవారము నాడు జన్మించినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు -- మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.
మస్కట్‌లో అయ్యప్ప పూజ - పూజా మంటపం శబరిమలై లోని దేవాలయం నమూనాలో కట్టబడింది.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
శబరిమలైలో నివాసం
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
దేవాలయాలు
శబరిమలై
శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.
దేవాలయ నిర్మాణము
అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశము లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా కలదు.
ఇతర ఆలయాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక పట్టణాలు. గ్రామాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు
పూజా విధానాలు
నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
దీక్ష, మాల, నియమాలు
భక్తులు కార్తీకమాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య, మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం(నలభై రోజులు) పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.
దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి (సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
అయ్యప్ప పూజా విదానం]
శ్రీ విఘ్నేశ్వర అన్ఘ పూజ
శ్రీ విఘ్నేశ్వర అశ్ట్టోతర శతనామావళి
శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి అన్ఘ పూజ
శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి అశ్ట్టోతర శతనామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అన్ఘ పూజ
శ్రీ అయ్యప్ప స్వామి అశ్ట్టోతర శతనమావళి
శ్రీ అయ్యప్ప స్వామి శరను ఘోష
లోక వీరమ్ మహా పూజ్యమ్ - సాస్త దసకమ్
అయ్యప్ప ఆరతి
క్షమార్పన
భజన
ఇరుముడి
రెండు అరలువున్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు. ఇరుముడిలో1. నేతితో నింపిన కొబ్బరికాయ 2. రెండు కొబ్బరి కాయలు 3. వక్కలు 4. తమలపాకులు 5. నాణాలు 6. పసుపు 7. గంధంపొడి 8. విభూతి 9. పన్నీరు 10. బియ్యం, 11. అటుకులు, 12. మరమరాలు, 13. బెల్లం/అరటిపళ్ళు 14. కలకండ 15. అగరువత్తులు 16. కర్పూరం 17. మిరియాలు (వావర్‌ దర్గాకోసం) 18. తేనె 19. ఎండు ద్రాక్ష 20. తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను 'ఇరుముడి'గా కట్టుకునే ఉత్సవాన్ని'కెట్టునిరా' లేదా 'పల్లికెట్టు' అంటారు.
పడిపూజ
అయ్యప్ప స్వామి
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం -
హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శబరిమలై యాత్ర
శబరిమలై లో దర్శనానికి వేచిఉన్న భక్తులు.
ముఖ్య వ్యాసము: శబరిమల
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.
ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.
పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.
చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.
సన్నిధానం
భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.
సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.
సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.
ఇతర విశేషాలు]
మణికంఠుడు అని : తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం!
నల్లని వస్త్రాలు :బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి!! తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను 
ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు తెలియజేశాడు