The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Telugu Persons. Show all posts

BRIEF INFORMATION ABOUT THE GREAT WRITER SRI ADHI KAVI NANNAYYA GARU
మహర్షి ఆదికవి నన్నయ
వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్య ప్రక్రియలో నిత్యసత్య వచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికి ఆంధ్రమహాభారత కావ్యం పండిత పామరులను ఆకట్టుకొంటున్నది.
భూమిక్రిందున్న పాతాళలోకం చీకటిమయం కదా? అక్కడకు వెలుగు ఎలా ప్రసరిస్తుందన్న ప్రశ్నకు సమాధానం నన్నయ మహర్షి ఎలా చెప్పగాలిగారో చదివితే తెలుస్తుంది.
ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆంధ్రమహాభారత రచన జరిగి నేటికి వెయ్యేళ్ళు కావస్తున్నది. నన్నయగారు 4000 పద్యాలలో ఆదిసభారణ్యపర్వాలను తెలుగు చేసారు. అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో పద్యరచన ఆగింది. కారణం నన్నయ గారు పరమపదించడం. ఆంధ్రానువాదపీఠికలో తనను గురించి నన్నయగారు నిత్య సత్యవచనుడననీ, అవిరళజపహోమతత్పరుడననీ చెప్పుకున్నారు.
రాజరాజు కుల బ్రాహ్మణుగా ఉంటూ అనుదినం రాచకార్యాలలో పాల్గొంటూ కావ్యారంభంలో ఎంతో వినయశీలాన్ని ప్రదర్శించారు. వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్యప్రక్రియలో నిత్యసత్యవచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికీ ఈ రచన పండితపామరులను ఆకట్టుకొంటున్నది. "నా నృషిహ్ కురుతే కావ్యం" - మహాకావ్యాలను ఋషులే వ్రాయగలరు. మహర్షులు విశ్వం నలుమూలల నుండి గొప్ప భావాలను స్వీకరించిన మహోన్నత ఆదర్శపురుషులు.
* ఆనోభద్రా క్రతవోన్యంతువిశ్వతః
ఋషులు మన కళ్లెదుటనున్న నిత్యసత్యాలను వెలికిదీసి చూపేవారు. మరి కవులో, అతిశయోక్తి అలంకారానికి జీవం పోసేవారు. ("కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " - ఏనుగుల సమూహం దోమ కుత్తుకలో ప్రవేశించటం). నన్నయగారు కావ్యారంభంలో స్మరించిన ఋషిపుంగవులు ఇద్దరే- వారే వాల్మీకి, వ్యాసులు. వారి అడుగుజాడల్లో నిత్యసత్యాలను వెదికి మనకు జ్ఞానతేజాన్ని చూపారు.
వాల్మీకి మహర్షిని - "దుర్భరతపోవిభవాధికుడు (అధికతపస్సంపద చేత గొప్పవాడు), గురుపద్యవిద్యకు ఆద్యుడు (పద్యరచనా సంప్రదాయానికి తొలి కవి), అంబురుహ గర్భవిభుడు, (బ్రహ్మతో సమానుడు)" అన్నాడు నన్నయ.
వ్యాసమహర్షిని - "భరతవాక్యములను శుభకరములైన కిరణములచేత సంసార దుఃఖమను చీకటి తొలగించి పండిత హృదయ కమలములకు వికాసము కల్గించిన వ్యాససూర్యుడు"గా కీర్తించాడు. వ్యాసహృదయకమల వికాసము శాశ్వతమని అన్నాడు.
* ఆంధ్రభారతకావ్యాన్ని విశ్లేషిస్తే...
శకుంతల, దుష్యంతునిసభలో నిరాదరణకు గురియై, కుమారుడు భరతుని, రాజుకు చూపిస్తూ,
"విపరీతప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ! ఈ పుత్రగా
త్ర పరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహారకర్పూరసాం
ద్ర పరాగప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయుం బుత్రగా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే ? కడున్ శీతమే ?"
అంటుంది. ఓ రాజా, విరుద్ధాలైన మారుమాటలు ఎందుకు ? కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖానుభూతి పొందుము. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచిగంధం, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు మంచి చల్లదనాన్ని, సుఖాన్ని కలిగించలేవు.
ఇందులో నన్నయ ఎన్నుకొన్న ఉపమానాలన్నీ, వ్యాసభారతంలో లేని విషయాలు. సర్వప్రాణులకు అంటే పశుపక్ష్యాదులకూ కౌగిలి సుఖం సమానమేనంటున్నాడు - విశ్వజనీన భావన.
వేటకై వెళ్లిన దుష్యంతుడు అడవిలో తిరుగుతూ, తాను ముని ఆశ్రమంలో ప్రవేశించానని ఎలా ఊహించాడో, నన్నయ వాక్కులో చూడండి.
"అపేయలతాంతములైనను బాయని మధుపప్రకరంబు జూచి"- దుష్యంతుడు చెట్లకొమ్మలు చూచాడు. వాటిపై పుష్పములు లేకున్నప్పటికీ తుమ్మెదల గుంపు కొమ్మలపై ఎలా వ్రాలాయి అని ఆశ్చర్యంగా తిలకిస్తున్న రాజుకు, కారణం వెంటనే స్ఫురించింది. యజ్ఞహవిస్సులో కమ్మని నెయ్యి, హోమద్రవ్యాలు ఋషులు వాడటం వల్ల సువాసనల పొగలతో చూరిన తీగలు ఆ చెట్ల కొమ్మలను అల్లుకొనడం వల్ల తుమ్మెదల గుంపులు అక్కడ చేరాయి.
ఎంత కమ్మని మధురభావన !
ఉపమా కాళిదాసస్య (నన్నపార్యస్య) - ఉపమాలంకారానికి కాళిదాసుతో సమానుడు నన్నయ. కచదేవయాని కథలో కచుడు ఉదయ పర్వత గుహాద్వారము నుండి ఉదయించు పూర్ణచంద్రుడో యనునట్లు శుక్రాచార్యుని ఉదరము ఛేదించుకొని బయటకు వచ్చాడు.
మరణించిన శుక్రాచార్యుడెలా బ్రతికాడో చూడండి -
"విగతజీవుడై పడియున్న వేదమూర్తి యతని చేత సంజీవితుడై వెలుంగెదనుజమంత్రి ఉచ్ఛారణ దక్షుచేత నభిహితంబగు శబ్దంబు నట్లపోలె".
ఉచ్ఛారణ సామర్ధ్యం గల ఒక విద్వాంసుడు పటుత్వంతో పలికిన వేదశబ్దం ఎలా సజీవంతో వెలుగునో, ఆ విధంగా శుక్రాచార్యుడు కచుని చేత సంజీవనీవిద్య చేత బ్రతికింపబడ్డాడు.
బ్రహ్మవేత్తలైన ఋషులే ఇలా భావన చేయగలరు. అందుకే నన్నయను విపులశబ్దశాసనుడన్నారు.
గర్భవతియైన జరత్కారువు భార్య (ఆస్తీకుని తల్లి) "దినకరగర్భయగు పూర్వదిక్సతివోలె" ఉన్నది అంటాడు నన్నయ. సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంత వలె ఆమె ప్రకాశించింది.
అలాగే కిరాతార్జునీయ సన్నివేశంలో -
కం|| హరుశరమును నరు శరమును సరి నిరుపక్కియలు దాకి జవమఱి శరసం
భరమున దిరిగె వరాహము శరనిధి మథనమున దిరుగు శైలముపోలెన్"
శివుడు ప్రయోగించిన బాణమున్నూ, అర్జునుడు వేసిన అమ్మున్నూ ఏకకాలంలో ఇరువైపులా ఆ పందిని తాకాయి. రెండు డొక్కలలో నాటుకొన్న ఆ రెండుబాణాల తాకిడికి ఆ వరాహం శక్తి నశించి క్షీరసాగరమథన సమయంలో తిరిగిన మందరపర్వతం వలె గిరగిర తిరిగింది.
తాతగారు మనవడికి కథ చెప్తున్నాడు.
1. భూలోకం మనమున్నది.
2. పైన స్వర్గనరకలోకాలు
3. క్రింద- పాతాలలోకం
భూమి క్రిందున్న పాతాల లోకం చీకటి కదా తాతయ్యా, అక్కడకు వెలుగు ఎలా వస్తుందన్న మనవడి ప్రశ్నకు, నన్నయ మహర్షి సమాధానం చూడండి.
"అలఘు ఫణీంద్ర లోకకుహరాంతర దీప్త మణి స్ఫురత్ ప్రభావలి
గలదాని, శశ్వదుదవాస మహావ్రత శీతపీడితా
చలముని సౌఖ్యహేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబుల
వెలిగెడుదాని గాంచిరరవింద నిభానన లమ్మహోదధిన్"
ఇది సముద్రవర్ణన. సముద్రం రత్నగర్భ. వెలలేని మాణిక్యాలకు నెలవు. అవి సముద్రం అట్టడుగున ఎందుకున్నవో తెలుసా? ఆ మణుల కాంతి పాతాళలోకానికి వెలుగు ప్రసాదించి, చీకటి పోగొట్టుటకే. అలాగే సముద్రగర్భంలో తపస్సు చేసుకొంటున్న మునుల చలిని పోగొట్టే బడబాగ్నికూడ వారికి సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నది.
నిజంగా నన్నయగారు వేయి సంవత్సరాలకు పూర్వమే నీటిలో వెచ్చని శక్తి (కరెంటు) ఉందని చెప్పగలిగారు. మహర్షుల వాక్కులు అమోఘం, దివ్యం!
అంధుడైన దీర్ఘతమమునిసత్తముని, ఒక్కడిని తల్లి ఆజ్ఞపై పడవలో బంధించి కుమారులు గంగాప్రవాహంలో వదలగా, కొట్టుకుపోతున్న ఋషి ఎంచేసాడు అన్న ప్రశ్నకు వ్యాసుడు సమాధానం చెప్పకపోతే, మహర్షి నన్నయ ఏమంటున్నాడంటే - "ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయ స్వరభేదంబులేర్పడ సలక్షణంబుగా వేదము చదువుచుండెనట"- ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయస్వరభేదం స్పష్టంగా తెలిపేటట్లు లక్షణ సహితంగా వేదాలను చదువుతూ కాలం వెళ్లబుచ్చాడు.
"తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
యును ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
లనఘ, యుపనేత మరియు నిరంతరాధ్యాపకుండు,
ననగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు"
స్త్రీలకు తండ్రులుగా కన్నవాడినీ, అన్నం పెట్టినవాడినీ, భయం నుండి రక్షించినవాడినీ, మొత్తం వరుసగా ముగ్గురిని గురువులుగా ముచ్చటగా చెప్పుతారు. ఓ పుణ్యాత్ముడవైన మహర్షీ! పురుషులకు ఈ ముగ్గురే కాక ఉపనయనం చేసినవాడినీ, వేదాలు చెప్పినవాడినీ కలిపి మొత్తం ఐదుగురిని గురువులుగా ఎల్లప్పుడూ పరిగణిస్తారు.
"మూలంలో శరీరకృత్, ప్రాణదాతా, యస్య చాన్నానిభుంజతే, క్రమేణైతే త్రయోప్యుక్తాః పితరోధర్మదర్శనే" అని స్త్రీలకు గురువులైన ముగ్గురే చెప్పబడియుండగా, నన్నయ పురుషులకు ఐదుగురు గురువులని విశేషించి పేర్కొన్నాడు.

A TRIBUTE TO SRI UNNAVA LAKSHMI NARAYANA GARU - FREEDOM FIGHTER AND WRITER
శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ గారు డిశంబర్ 4, 1877 న జన్మించారు.
వీరు గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. 1877 డిసెంబరు 4. ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించారు.. 1900 లో గుంటూరు లో యంగ్మెన్స్ లిటరరీ అసోసియేషన్ ను స్థాపించారు. 1902 లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించారు. . వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించారు.. రాజకీయ వాతావరణాన్ని, గాంధీ మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఈ సాంఘిక నవలలో సాంఘిక దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ , వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితులను కన్నులకు కట్టినట్లు ఉన్నవ చిత్రించారు.. ఆనాడు హరిజనుల కుటుంబ గాథను ఇతివృత్తంగా ఎన్నుకొని నవల వ్రాయడమే సాహసం. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక , సాంఘిక, కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేయిస్తారు, కాబట్టి ఈ నవలకు ' సంగవిజయం' అనే పేరు కూడా సార్థకమయింది. ఉన్నవ ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయ కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించారు..ఈ నవలకు పీఠిక వ్రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ఈ నవలను గూర్చి " ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి" అని కొనియాడాడు. తెలుగు విప్లప సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం ' మాలపల్లి '. నాయకురాలు , బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు తదితర రచనలు ఉన్నవ చేశాడు. గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందారు.

ARTICLE IN TELUGU ABOUT THE LEGENDARY MATHEMATICIAN OF INDIA - THE GREAT BHASKARACHARYA
భాస్కరాచార్యుడు
సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.
భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశొధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.
అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.
* సిద్దాంత శిరోమణి గ్రంధం
క్రీ.శ. 1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు. అవి
౧. లీలావతి(అంక గణితం)
౨. బీజగణితం
౩. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
౪. గ్రహగణితo (గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తుంది. మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు, వర్గ సమీకరణాలను, అనంతం (ఇంఫినిటి)ని కనుగొని చర్చించి, వాటిని సాధించింది. సమీకరణాలను వాటి 3వ, 4వ ఘాతం వరకు సాధించింది. త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.
మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము. కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి. కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."
ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.
తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళ గణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు.
వీరు మరణించిన సంవత్సరం క్రీ.శ. 1185
భారత దేశపు రెండవ (భాస్కర-1) మరియు ఐదవ (భాస్కర-2) కృత్రిమ ఉపగ్రహాలకు వీరి పేరు పెట్టారు.
Subscribe to:
Posts (Atom)