ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Lord Sri Venkateswara Swamy Stories and Articles in Telugu. Show all posts
Showing posts with label Lord Sri Venkateswara Swamy Stories and Articles in Telugu. Show all posts

SRI VENKATACHALA MAHIMA - TELUGU BHAKTHI KADHA


శ్రీవేంకటాచల మహిమ

పూర్వము కాంభోజ దేశమును శంఖణుడను రాజు యేలుచుండెను. ఆ రాజు చాలా ధర్మాత్ముడు. భార్యయూ మంచి గుణవంతురాలు. కొన్నాళ్ళకు శత్రురాజులందరూ యేకమై శంఖణుని మీదికి యుద్ధమునకు వచ్చిరి. శంఖణుడు యుద్ధమున వారిని ఢీకొని పోరాడుచుండెను. శంఖణుడు ఒక్కడు వారు పదిమంది, బలవంతమైన సర్పమైననూ చలిచీమల చేతచిక్కి చావదా? అన్నట్లు యెంత బలవంతుడైననూ పదుగురను జయింపలేడు. అందువలన శంఖణుడు శత్రువులకు వోడిపోయి తన రాజ్యమును విడిచి భార్యతో కట్టుబట్టలతో అరణ్యము పాలైనాడు.
శంఖణుడు రామేశ్వరము మొదలైన యాత్రలు చేసి, సేవించి, పవిత్రమైన అలివేలు మంగాపురము జేరి, పద్మసరోవరతీర్థములో నిత్యము స్నానము చేయుచూ తనకు గల్గిన ఆపదలను గూర్చి విచారించు చుండెను. ఒకనాడు ఆకాశవాణి "మహారాజా దుఃఖము పొందకుము. శ్రీవేంకటాచలమునకు పోయి అందుగల పుష్కరిణిలో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని పూజింపుము. నీ దుఃఖము తీరి విజయము కల్గు" నని చెప్పెను.
శంఖణుడు సంతోషముతో భార్యను వెంటబెట్టుకొని వేంకటాచలము జేరి, పుష్కరిణిలో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని తులసితో పూజించెను. స్వామికి అతనిపై అనుగ్రహము కలిగి "రాజా! నీకు మరల రాజ్యప్రాప్తి గల్గును" అని సెలవిచ్చెను.
శంఖణుడు భార్యతో తన రాజ్యము జేరి శత్రువులను సంహరించి రాజ్యమును సంపాదించుకొని సుఖపడెను.

GOVINDA NAMA MAHIMA - POWER OF NAME OF LORD VENAKTESWARA


గోవింద నామ మహిమ, శ్రీ వెంకటేశ్వర వైభవం
* విష్ణు నామాల యందు గోవింద నామానికి విశేషమైన ప్రీతి.
* శ్రీ రామ నామం - సర్వ కాలముల యందు చెప్ప వలసిందే.
* గోవిందా గోవిందా గోవింద, అని మూడు సార్లు చెబితే ఆది సత్యం.
* గోవింద నామాన్ని పలకడంలో సంకోచించకండి
* కృష్ణుడే గోవిందుడు.
* సర్వత్ర స్మరాణం == గోవిందా గోవిందా
* మనుష్యుల జీవితాలకి ఉద్ధరణ కలిపిస్తుంది ఈ గోవింద నామం.
* అంతటా నిండి ఉన్న పరమాత్మ మన మాంస నేత్రాలకి కనబడతాడా? లేదు.
* నిన్ను ఆయన దగ్గరికి చేర్చడం లో ఉపయోగ పడేది గోవింద నామం.
* మనిషి పతనానికి కారణం - ఈ భూమి నాది అనడం.
* గోవుని రక్షించడం వినా అవి భాదపడానికి ఆస్కారం లేదు.
* ధర్మమనే కట్లుతో లోపల ఉన్న కట్ట్లు ఇప్పేస్తాడు, గోవిందుడు. ఇన్ద్రియాల వల్ల పైకి వెల్లేట్లు చేస్తాడు.
* ఎవ్వడైనా సరే గోవింద నామాన్ని ఆశ్రయించాల్సిందే.
* వెంకటేశ్వరుడు ఎవ్వరు? పురాణాల్లో ఆయన తనంతట తన పేరు చెప్పుకున్నప్పుడు ఎక్కడా శ్రీనివాస అని చెప్పుకొలేదు. కృష్ణుని యొక్క పరిపూర్ణావతారమే వేంకటేశ్వరునిగా వచాడు.
* కృష్ణుడు == వెంకటేశ్వరుడు
* ఆయన పద్మావతి చెలికత్తె లతో ఏమీ చెప్పు కున్నారంటే

. జనకో వాసుదేవశ్ఛ దేవకీ జననీ మామ ( parents are devaki & vasudev)
. అగ్రజా శ్వేత కేశస్చ ( elder brother is balaram)
. సుభద్రా భగినీ మమ ( younger sister is subhadra)

* రక్షణకి పరాకాష్ట గోవింద నామం.
* ఈ భూమి పైవాడిది అని తెలుసుకోవడం గోవింద.
* ఇంద్రీయాలని సక్రమంగా ఉపయోగించి ఆయన్ని చేరడం గోవింద.
* కలియుగం లో నామ సంకీర్తన కన్నా గొప్పది లేదు.
* ద్వాపరి యుగం లో రాక్షాసుల్ని పీచ మణిచాడు.
* కలియుగంలో కలి పురుషుడు బయట ఉండడు. లోపల ఉంటాడు. మనుష్యుల మనస్సులలో ఉన్న కలి పురుషున్ణి తీసేయాగలదు, గోవింద నామం.
* కలిని తీసేయడానికి వెంకటేశ్వరుడు, ప్రభోదం చెయ్యడానికి, శంకర ఆచార్యులు ఉధ్భవించారు.
* గోవిందా అని పిలిస్తే వాడికి ఏడు తరాల వరకు రక్షణ లభిస్తుంది.
* గోవిందా అంటే ఆయన పరవశిస్తాడు. రక్షణ కవచం కడతాడు.

koMDalalO nelakonna kOnaeTi raayaDu vaaDu


కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
..
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండ మాం చక్కుర వర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు
..
అచ్చపు వేడుకతోడ ననంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు
..
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు

koMDalalO nelakonna kOnaeTi raayaDu vaaDu
koMDalaMta varamulu guppeDu vaaDu
..
kummara daasuDaina kuruvaratinaMbi
yimmanna varamulella nichchina vaaDu
dommulu saesina yaTTi toMDa maaM chakkura varti
rammanna chOTiki vachchi nammina vaaDu
..
achchapu vaeDukatODa nanaMtaaLu vaariki
muchchili veTTiki mannu mOchina vaaDu
machchika dolaka dirumalanaMbi tODuta
nichchanichcha maaTalaaDi nochchina vaaDu
..
kaMchilOnuMDa tirukachchinaMbi meeda
karuNiMchi tanayeDaku rappiMchina vaaDu
eMchi yekkuDaina vaeMkaTaeSuDu manalaku

GOD OF SEVEN HILLS STORIES IN TELUGU - VAKULABHARANAM - STORY OF MARRIAGE OF LORD VENKATESWARA SWAMY AND PADMAVATHI


వకుళా’భరణం

వెైకుంఠవాసుడు శ్రీక్ష్మీలోలుడు, శ్రీమన్నారాయణుడు, దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం పుత్రుడెై జన్మించాడు. ఆయనకు జన్మనిచ్చింది దేవకి అయినా పెంచింది యశోద. శ్రీకృష్ణుడని నామకరణం చేశారు. గొల్లపిల్లలతోనే తిరిగాడు. శ్రీకృష్ణునికి అల్లరితనం చాలా ఎక్కువ. గొల్లభామలతో రాధికామనోహరుడు పెరిగాడు. ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. కొంత కాలానికి కంసుడు ద్వారకకు రమ్మని పిలిచాడు. ఆ సమయంలోనే కంసుని వధించి తన తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించాడు. ఇలా ఉండగా శ్రీకృష్ణుడు అనేక మంది గోపికలను పరిణయమాడాడు.

దీంతో తల్లి యశోద ‘బిడ్డా ఇన్ని వివాహాలు చేసుకున్నావు, కనీసం ఒక్క వివాహానికైనా పిలవలేదే?’ అని శ్రీకృష్ణుని ప్రశ్నించింది. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘అమ్మా బాధపడకు, కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను, అప్పుడు నువ్వే దగ్గర ఉండి వివాహం చేయుదువు అని చెప్పారు. ఆ తర్వాత కలియుగంలో శ్రీకృష్ణుడు వెంకటేశ్వరుని అవతారాన్ని పొందాడు. అప్పుడు యశోద వకుళమాతగా అవతారం ఎత్తింది. ఏడు కొండలకు వచ్చింది. నదీ తీరాన కుటీరం వేసుకొని, నివసించసాగింది. ఒకనాడు నీటి కోసం బయలుదేరింది. దారిలో ఒక బాలుడు పడి ఉండడాన్ని ఆమె గమనించింది.

దీంతో ఆమె ఆందోళన చెంది, ముఖంపెై నీళ్ళు చల్లి లేపించి. ‘ఎవరు బాబూ!?’ అని ప్రశ్నించింది. దానికి ఆ బాలుడు జవాబు చెప్పలేదు. ఆమెకు ఏమీ అర్థం కాక ఎంతో ఆదుర్థాగా ‘శ్రీనివాసా...’ అని పిలిచింది. వకుళమాత నోటి నుంచి ఆ పలుకులు రాగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. దీంతో ఆమె ఆ బాలుని తన కుటీరానికి తీసుకొని వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. పెద్దవాడవుతున్న ఆ బాలుడు వనంలో తిరిగేందుకని బయలుదేరాడు. దారిలో పద్మావతి కనిపించింది. ఆమె చెల్లికత్తెలతో వివరాలను ఆరా తీశాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతి అని చెలికత్తెలు చెప్పి అక్కడి నుంచి పరుగు తీశారు. ఆ విషయాన్ని వచ్చి తన తల్లికి చెప్పాడు.

అడవిలో తాను చూసిన యువతితో వివాహం జరిపించమని తల్లికి వివరించాడు. దీంతో వకుళమాత రాయభారానికి పద్మావతి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. మీ కుమార్తెను తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపించాల్సిందిగా ఆమె ఆకాశరాజు దంపతులను కోరింది. అందుకు ఆకాశరాజు దంపతులు సంతోషించి వివాహానికి అంగీకరించి ఘనంగా వివాహం జరిపించారు.

* పూలదండగా మారిన వకుళమాత...

వివాహం తరువాత పుణ్యదంపతులు ఏడుకొండలపెైనే నివసించసాగారు. కాగా లక్ష్మీదేవి ఆగ్రహావేశాలతో అక్కడికి చేరుకుంది. ‘నన్ను కాదని పద్మావతిని వివాహం చేసుకున్నందుకు నీవు శిలగా మారిపో..’ అంటూ శపించింది. అప్పుడు శిలగా మారిన వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి. పద్మావతి నిలిచిపోయారు. అప్పుడు వకుళమాత పూలదండగా మారి శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలో పడింది. అంటే వెంకటేశ్వర స్వామి హృదయంపెైనే నిలిచింది.

తిరుమల దేవాలయంలో కుమారుడు శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో (పోటు స్థలంలో) వెలసిన వకుళమా తను మొదట దర్శించిన వారికే శ్రీ శ్రీనివాసుని అనుగ్రహం లభించునని తన తల్లికి ఆయన మాట ఇచ్చాడు . కాబట్టి దీనిపెై అనవసరమైన వివాదాలు విడనాడి తిరుమలలో ఉండే నిత్యకల్యాణం పచ్చతోరణంతో వెైభోగంగా ఉండే ఆలయంలోనే వకుళమాతను ప్రతిష్ఠించాలి. వకుళమాత విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించాలా? అనే వివాదం ఇటీవల కాలంలో తలెత్తింది. తిరుపతిలో ప్రతిష్ఠిస్తే, కుమారుని పాదాల కింద ఏర్పాటు చేసినట్లు అవుతుందన్న వాదన ఉంది. కాబట్టి ఈ వివాదానికి తెరదించాలంటే, వకుళమాత విగ్రహాన్ని ఏడుకొండల స్వామి ఆలయం సన్నిధిలోనే ఏర్పాటు చేయాలి.