The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Telugu Youth. Show all posts
Showing posts with label Telugu Youth. Show all posts
TELUGU HOUSE DECORATION FOR Teenage Bedroom Ideas / TIPS
Teenage bedroom ideas is necessary, because they entered a critical age, they need their own bedroom to do things that are personal. At that age, they want to be independent and want to design their bedrooms according to taste and ideas of their own. As parents, we could only see, supervising, and advising them, to motivate and support all activities and their ideas in designing the bedroom very well utntuk them, here are some tips for teen bedrooms ideas.
WHY BLACK HAIR TURNS WHITE IN YOUNGER AGE - TIPS TO CHEK
జుట్టు తెల్లబడుతోందా..!
మామూలుగా కొంత వయసు వచ్చాక జుట్టు తెల్లబడటం అనేది ఎవరికైనా సహజమే. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా జుట్టు త్వరగా తెల్లబడిపోతోంది. ఇలాంటప్పుడు కొంచెం ఆలోచించి నివారణ ఉపాయాలు వెతకాలి. మీకు టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే తగ్గించండి. అంతేకాదు మసాలాలు, కూడా మానేయండి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే బాలనెరుపు సమస్య నుండి బయటపడవచ్చు.
DIFFERENT VARIETIES OF SAREE WEARING IN INDIA
చీరకట్టులో పలు విధాలు…
5
దేశ మహిళల్లో అధిక శాతం మంది ధరించే దుస్తులలో అతి ముఖ్యమైనది చీర. అయితే ఈ చీర కట్టులో పలు రకాలు వున్నాయి. సాధారణంగా భారతదేశంలో ఎక్కువ మంది చీరను ఒకసారి నడుంచుట్టూ తిప్పి, కొన్ని మడతలు పెట్టి, మళ్ళీ సగం నడుంచుట్టూ తిప్పి రెండవ చివర పైటచెంగును ఎడమ భుజం మీద నుంచి వెనుకకు వదిలేస్తారు.
అదే గుజరాత్ రాష్ట్ర మహిళలు మాత్రం.. పైట చెరుగు కుడి భుజం మీద నుండి వేసుకుంటారు. ప్రాంతానికో రీతిలో కనిపించే చీర కట్టు అందమంతా ఆరు గజాల వస్త్రంలో ఉంటుంది. అయినా ఒక్కొక్కరి ఒంటిమీద అది ఒక్కో రకంగా సింగారాలు ఒలుకుతుంది.
SAREE SOUNDARYAM WHY ? INDIAN WOMEN ARE SO BEAUTIFUL IN SAREES
అసలు సౌందర్యం చీరలోనే ……!
చీరకట్టులోఉన్న సౌందర్య రహస్యం ఏమిటంటే సన్నగావున్న వాళ్ళను ,లావుగా వున్న వాళ్ళను కూడా ఆకర్షణీయంగా చూపించేది చీరే. – సన్నగా వున్న స్త్రీ మందంగా వుండే చీరలు,గంజిపెట్టిన కాటన్ చీరలను కట్టుకుంటే సమంగా, అందంగా కనిపిస్తారు – లావుగా వుండే స్త్రీ తేలికైన సింథటిక్ చీరలను కట్టుకుంటే పొందికగా కన్పిస్తారు . అందాలను దాస్తూనే వెల్లడించగల ఒడుపు ఒక్క చీర కట్టులోనే సాధ్యమౌతుంది – చీర కట్టుకోవటంలో కూడా కాస్తంత నేర్పు వుండాలి. చీరేల ఎంపిక శరీర ఛాయను బట్టి చీరే రంగును ఎంచుకోవాలి . – పొట్టిగా లావుగా వుండేవారు నిలువు చారలున్న చీరెలు కొనుక్కోకూడదు .అడ్డ చారల డిజైన్స్ అయితే వారు కొద్దిగా పొడుగ్గా తక్కువ లావుగా కనిపించే అవకాశం వుంది .
మీరు ఏమంటారు?
కాని నాకు చీర కట్టుకోవడం సరిగా రాదు . రోజు చీర కట్టుకున్న వాళ్ళని చూసి వాళ్ళ కట్టు ఎలా వుందో చూస్తుంటాను. ఇరోజుల్లో అందరు పంజాబీలు, ప్యాంటు ,షరటులు
కాసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా వస్తోందండి అబ్బాయా? అమ్మాయా? అని జుట్టు కూడా కత్తిరించడం కూడా బాగా ఎక్కువ అయిపాయిందండి.
కాసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా వస్తోందండి అబ్బాయా? అమ్మాయా? అని జుట్టు కూడా కత్తిరించడం కూడా బాగా ఎక్కువ అయిపాయిందండి.
LADIES ARE SO BEAUTIFUL IN TRADITIONAL SAREE - WHY THEY ARE LOOKING SO BEAUTIFUL IN SAREES - WHAT TYPE OF SAREES THEY HAVE TO WEAR IN FUNCTIONS / PARTIES ETC TIPS FOR SAREE WEARING
ఆడవాళ్ళకు చీరలోనే అసలైన అందం
చీరకట్టు ఎరగని భారతీయులుగానీ, చీరకట్టు అంటే ముచ్చటపడని విదేశీయులుగానీ లేరనడంలో సందేహం లేదు. ప్రతినిత్యం ఏదో ఓ కొత్తదనం కోసం పాకులాడుటం మానవనైజం. అవి కట్టు, బొట్టు విషయంలోకావచ్చు, వేరే ఏ ఇతర విషయాలలోనైనా కావచ్చు. చూస్తున్న ప్రతిసారి ఏదో కొత్త సొంపు, సోయగం, హుందాతనం కలిగి, మరుగునపడడం కాదు. కనీసం తెరమరుగున పడటం అంటే కూడా ఎరగని సిసలైన సాంప్రదాయక సౌందర్యం చీరదే. మన డిజైనర్లు కూడా చీరపై ఉన్న మక్కువతో, దాదాపు ప్రతి ప్యాషన్‌షోలోనూ ఒక మోడల్‌తోనో, సినీతారతోనో చీరతో క్యాట్‌వాక్ చేయిస్తున్నారు. డిజైనర్ల దాకా ఎందుకు. చీరలపై తమకు గల మక్కువను నాటి నుండి నేటి దాకా ఎందరో కవులు తేటతెల్లం చేసిన సంగతి అందరికీ విదితమే ”చీరగట్టి సింగారించి చెంగావి రంగుచీర, సరికొత్త చీర ఊహించినాను అంటాం. ఈ చీర పాటలు అందరి మనసులను అలరించాయి, కిన్నెరసాని వలపు చూడాలన్నా ఎంకి కడియం మెలగాలన్నా అది చీరకే సాధ్యం మరి.
ప్రాణమొచ్చిన బొమ్మకైనా కులుకు చెప్పే బొమ్మకైనా నిండుదనం చేకూర్చది చీరే. ఈ చీర గురించి చెప్పాలంటే మాటలేదు, చదవాలంటే భాషలేదు. ఎంత చెప్పినా ‘ఇంతేనా’ అనిపించే చరిత్ర మన చీరకుంది. నారచీర నుండి పట్టుచీర వరకూ దేని అందం దానిదే. దేని సోయగం దానిదే. పాశ్చాత్య నాగరికత మోజులో చీరకట్టుకోవడం కూడా చేతకాదంటూ అమాయకంగా ముఖం పెడుతోంది నేటియువత. పాపం వారిపై జాలితోనో లేక మన సంప్రదాయక సౌందర్యాన్ని ఎక్కడ మిస్ చేసుకోంటోరో అనే బాధతోనో తెలియదు కానీ మామూలు డ్రస్సులా, రెడీమేడ్‌గా చీరను ”తొడుక్కునే” విధంగా కూడా డిజైన్ చేశారు మన డిజైనర్లు. ప్రపంచ దేశాల్లో ఫ్యాషన్ రారాజుగా వెలుగొందుతున్న ప్యారిస్‌లో కూడా ఈ చీర కట్టుకు అభిమానులున్నారు.
భారతీయులమై కనీసం చీర కుట్టకోవడం నేర్చుకోవడం మన బాధ్యత. కాబట్టి అమ్మాయిలు చీర కట్టుకోవడం రాదని మాత్రం చెప్పకండీ. విదేశీయులు వింటే నవ్విపోతారు. చీర, చీర అంటున్నాం, అసలేంటీ చీర అంటే, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక వస్త్రం మాత్రమే. ఐదు నుండి ఆరు గజాల పొడువుండి ఎటువంటి శరీరాకృతి కలవా రికైనా సరిపోయే గుణం దీనికుంది. చీరల రంగు, టెక్చర్, ప్రింట్స్, వర్క్స్ వీటిని బట్టి అవి ఏప్రాంతానివో ఇట్టే చెప్పొచ్చు. ఈ చీరను ఎన్నో రకాలుగా ధరించొచ్చు. చీర ధరించిన విధానాన్ని బట్టి ఆయా వ్యక్తుల హోదా, వయస్సు ఎన్నో అంచనా వేయొచ్చు.
చీరలు కొనడం నుండి, కట్టుకోవడం వరకు
హెవీ పర్సనాలిటీ ఉన్నవారు షిఫాన్, జార్జెట్‌ల్లో చీరలు ఎంపిక చేసుకొండి. హెవీ మైసూర్ శారీస్‌లో అందంగా, స్లిమ్‌గా కనబడతారు.
తక్కువ హైట్ ఉన్నవారు సన్నని బోర్డర్స్ ప్రిఫర్ చేసే మంచిది. అసలు బోర్డర్‌లేని చీరలు కూడా బాగుంటాయి. అలా కాకుండా హెవీ బోర్డర్స్ తీసుకుంటే ఉన్న దానికంటే స్మార్ట్‌గా కనబడతారు. కాబట్టి హెవీ బోర్డర్స్ తీసుకోపోవడం మం
సన్నటి వారు ఆర్గాన్‌జా, టిష్యూ, కాటన్, టస్సర్ శారీస్‌లో నిండుగా కనబడతారు.
ఫంక్షన్ వెళ్లాలనుకున్నప్పుడు ఒంటిపొరను పిన్ చేసి స్టైల్‌గా చేతిపై నుండి పట్టుకుంటే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది.
ఉద్యోగం చేసేవారు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా ఫ్రిల్స్‌సెట్ చేసి పిన్ పెట్టడం మంచిది. ఆఫీసులో ఎలాంటి అన్‌యిజీ లేకుండా ఉండటమేకాకుండా సింపుల్‌గా, అందంగా ఉంటుంది.
శారీపై ఫ్రిల్స్‌ఉన్న పెట్టీకోట్ వాడకూడదు.
కాటన్ శారీ ధరించాలనుకునే వారు స్టార్చ్ పెట్టటం, ఐరన్ చేయటం మరిచిపోవద్దు, ఇలా చేస్తే కాటన్ చీర అందం పెరుగుతుంది. కట్టుకున్న వారికి హుందాతనం వస్తుంది.
చీరకట్టు తెలిసిన వారైతే ఈ చిన్నచిన్న సలహాలు పాటించి అందాన్ని పెంచుకోవచ్చు.
చీరకట్టు తెలిసిన వారైతే ఈ చిన్నచిన్న సలహాలు పాటించి అందాన్ని పెంచుకోవచ్చు.
The following are the list of heights, weights and measurements for all adults to be at their growing ages, other wise, don't neglect, just first contact ur nearest health advisor and take precautionary steps - don't forgot and don't neglect - especially in the case of our small children and kids. plz follow
Subscribe to:
Posts (Atom)