ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Winter Season Beauty Tips. Show all posts
Showing posts with label Winter Season Beauty Tips. Show all posts

COOL SEASON WINTER SKIN CARE BEAUTY TIPS


 చలికాలంలో చర్మ సౌందర్యం కోసం..

చలికాలం వచ్చేసింది. జనవరి దాకా చలి పులి మనల్ని బాధిస్తుంది. చలి వల్ల చర్మం పొడిబారుతుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మం అందంగా, మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

చలి వల్ల చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం పొడిబారుతుంది. తెల్లగా అవుతుంది. అందుకే మాయిశ్చరైజర్స్ ‌ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడాలి. 
మాయిశ్చరైజర్స్‌ వాడితే చర్మం పొడిబారదని చాలామంది అతిగా రాస్తుంటారు. అలా చేస్తే చర్మం నల్లగా, జిడ్డుచర్మంలా కనిపిస్తుంది. అందుకే చర్మంపై తగినంత మాయిశ్చరైజర్‌ని మాత్రమే రాసుకోవాలి.

కొందరికి చలికాలం వచ్చిందంటే చాలు కాలి మడిమల దగ్గర పగుళ్లు ఏర్పడతాయి. వాటికి కొబ్బరినూనె పట్టిస్తే మంచిది.

బయో ఆయిల్‌ యాంటీ ఏజింగ్‌గానే కాకుండా చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. మెరుపునిస్తుంది.

సీజనల్‌గా దొరికే కూరగాయలు, పండ్లను బాగా తినాలి. దీంతో పాటు ఒమెగా 3 అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, గింజలు లాంటివి రోజూ తినాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.