ఇజ్రేల్ లో ఉన్న స్ఫటికం గుహ....ఫోటోలు
ఇజ్రేల్ లో ఉన్న స్ఫటికం గుహ 1968 లో కనుగొనబడ్డది. దీని పేరు సోరెక్ స్ఫటిక గుహ. గని తవ్వకాల కోసం పనిజరుగుతున్నప్పుడు అనొకోకుండా ఈ స్ఫటిక గుహ కనబడింది. ఈ గుహను కనుగొన్న తరువాత ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచేరు. 1975 వ సంవత్సరం దీనిని ప్రకృతి నిలవ అని ప్రకటించి ఇప్పుడు సందర్శకులను అనుమతిస్తున్నారు.
ఈ గుహ 272 అడుగుల పొడవు,197 అడుగుల వెడల్పు, 49 అడుగుల ఎత్తు కలిగియున్నది.ఇక్కడున్న స్ఫటికం లేక స్ఫటిక విగ్రహాలు సుమారు 3,00,000 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవచ్చునని చెబుతారు.
స్ఫటికం: మినరల్-రిచ్ నీటి చుక్కలతో ప్రత్యేక ఉష్ణోగ్రతలో నిదానంగా ఏర్పడేదే స్ఫటికం. ఈ గుహలో ఉష్ణోగ్రత మరియూ తేమ ఒకేలాగానే ఉంటుందట.