ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Tholi Ekadashi Festival Articles. Show all posts
Showing posts with label Tholi Ekadashi Festival Articles. Show all posts

THOLI EKADASI FESTIVAL FULL STORY ARTICLE IN TELUGU


అన్ని ఏకాదశుల్లోకి తొలిఏకాదశి ఉత్తమోత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి.
ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని సంభావిస్తారు.స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులం దరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షి ణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్షనారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది.ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది.ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అను రాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.గోముఖభాగమందు వేదాలు,కొమ్మలందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాల ముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలాలనిస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీవ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు.హరిభజన చేస్తారు. చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు.దీనిని గురించి బ్రహ్మవైవర్తన పురాణం వివరిస్తుంది.ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయపైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు.దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారుల పండుగగా భావిస్తారు.కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు.పాలేర్లందరికీ కొత్తబట్టలిచ్చి వారిని గౌరవిస్తారు.

తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినడంలో అంతరార్ధం ఏమిటి?

ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు.

దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు శయనిస్తారని అందువలన లోక కళ్యాణార్ధము ఋషులు,స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు.

ఈ రోజున అన్ని దేవాలయములలో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు.

పేలాలలో బెల్లపు పొడి మరియు యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు.

గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువుకు మారుతున్న సమయం కనుక సహజంగా ఏర్పడే శారీరక ఋగ్మతలను ఈ పేలాల పిండి తీసుకొనటం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ రోజు పేలాల పిండిని మన పితృ దేవతలను స్మరించుకుంటూ తీసుకొనడం వలన వారు సంతుష్టులై మనని కాపాడుతారని పెద్దలు చెప్తారు.

ARTICLE ABOUT IMPORTANCE OF THOLI EKADASI FESTIVAL 04-07-2017


తొలి ఏకాదశి
.
ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.
.
సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.
పురాణగాథ ప్రకారం- యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.
.
కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో, ‘సింహవతి’ అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ని సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకొమ్మన్నాడు. ఆమె- ఏకాదశి తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.
దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు.
.
అలాగే ‘సతీ సక్కుబాయి’ తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి, మహావిష్ణువులో ఐక్యం చెందిందట.
.
దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు.
.
‘రుక్మాంగదుడు’ స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.
.
ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.
ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే.
.
ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది.
.
ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.
ప్రసన్నత, శాంతి, సాత్విక చింతన, దానధర్మాలు, జ్ఞాన పిపాసలకు తొలి ఏకాదశి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. భగవన్నామస్మరణ ద్వారా మోక్షాసక్తిని పెంపొందింపజేస్తుంది.


Tholi Ekadashi subhakankshalu


Tomorrow i.e. 4th July, 2017 tithi is auspicious "First Ekadashi" (Tholi Ekadashi in telugu language). Hindu festivals starting from tomorrow i.e. First Ekadashi onwards.
First Ekadashi festival is very popular and celebrated in a grand procession in Lord Vittal Temple in Pandaripur. On this auspicious occasion of First Ekadashi herewith i am sharing two vintage art prints of "Lord Vittal and Rukmini Maa of Pandaripur" of Ravi Varma Press which are in my collection.
Below is some brief history about Ashada Ekadashi procession taken place in Lord Vittal Temple, Pandaripur taken From Wikipedia, the free encyclopedia
"Ashadi Ekadasi is a religious procession and is celebrated during the months of June- July (Aashaadh Shukla paksha). It consists of a beautifully decorated Palkhi having the “padukas” of the lord and the Palkhi procession consists of people collectively walking, singing and dancing the glory of the Lord in what are called as ‘Dindis’.
The Palkhi procession has remained unbroken since it began despite wars, famines and floods. More than Fifty Palkhis of saints assemble at Pandharpur every year. In Maharashtra “Varkaris” (predominantly simple farmers) is a big community. They usually undertake 21-day walk after they have completed the sowing process in their fields. In the Ashadi Ekadasi festival, people from every faith and religion participate. Learned sages also come for it. Jnyaneshwar preached the Gita which is considered the highest religious text in Maharashtra.
The 'Bhakti Marg' (the path of devotion) as propounded by Sant Jnyaneshwar, teach us to forget the physical self in pursuit of the Lord. When the Varkaris sing and dance during the pilgrimage, they forget the material world around them.
Along with the Dindi procession, seva to the poor and needy is done reflecting that Lord is in all forms. This is called ‘Seva Dindi’. During the Seva Dindi, the people on pilgrimage undertake selfless service to the poor and needy like Amrut Kalash (Annadhan), Narayan seva, Medical seva, Building & repairing rural infrastructure etc.
Participation in Ashadi Dindi and Seva Dindi helps an individual in many ways by bringing good health, peace & prosperity in his life. Chanting the continuous glory of the God in the Ashadi Dindi procession and Seva Dindi purifies an individual, there is an inner cleansing that takes place in Mind, Body and Spirit and the participants tend to lose their individual identities and experience bliss. It develops all aspects of human personality and helps us understand the true purpose of Life."