ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SOUTH INDIAN FAMOUS TEMPLE - BRUHADRESWARA ALAYAM AT TANJAVOUR TAMILNADU INDIA - A BRIEF HISTORY AND FACTS


దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం

భారతదేశంలో దేవాలయం అన్నది మతానికి, ఆరాధనకు జీవగర్రగా ఉంటూ వచ్చింది. విగ్రహాన్ని నెలకొల్పిన ఆలయంలో భక్తులకు ప్రదక్షిణ, పూజచేయడానికి ఏర్పాట్లుండేవి. ఆలయం అనేది మనదేశంలో వివిధ దశల్లో రకరకాలుగా రూపొందుతూ వచ్చింది. ఆయా దేశ, కాల పరిస్థితులను బట్టి దేవాలయం మార్పులకు లోనవుతూ వచ్చింది. అయితే ఆలయాలను నిర్మించిన స్థపతులూ, శిల్పులూ ఒకే రకమైన శిక్షణ పొందినవారు. ఆయా దేవాలయాలలోని దేవుళ్లు, పూజాపద్ధతులు తెలిసిన పూజారులు, మతాధికారులు మొదలైన వారి ఆదేశాలనుసారం ఈ శిల్పులు ఆలయ నిర్మాణాలు చేశారు.ప్రధాన దేవతా విగ్రహాల రూపుౌౌరేఖలలో ఆలయాల శిల్పరీతులలో అలంకరణలలో మార్పులు చేశారు.వీటన్నిటి ఫలితంగానే మన శాస్త్రాలలో పేర్కొన్న వాస్తు శిల్ప, ఆగమ గ్రంథాలు, సూత్రాలు రూపొందాయి. ఈ కారణంగానే మన దేశంలోని వాస్తు శిల్పం అంటూ ఒక సమగ్రమైన, మౌలికమైన భారతీయ శిల్పంగా గోచరిస్తుంది. అలాంటి శిల్ప, వాస్తు సౌందర్యాల మేళవింపే బృహదీశ్వరాలయం...

తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీ శ్వరాలయం. తంజావూరుకు ఈ పేరు ‘తంజన్‌-ఆన్‌’ అనే రాక్షసుని వల న వచ్చిందని చెబుతారు. ఈ రాక్షసుడు శ్రీఆనందవల్లి అమ్మ, శ్రీనీలమేఘ పెరుమాళ్‌ ల చేత చంపబడ్డాడని, ఆ రాక్షసుని కోరిక మేరకు ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చిందనేది ఒక పురాణగాథ. చారిత్రకంగా ఈ నగరం చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు, ఆ తరువాత విజయ నగర రాజులు పరిపాలించారు. అటుపిమ్మట 1674వ సంవత్సరంలో ఈ నగరాన్ని ‘వెంకాజీ’ ఆక్రమించుకున్నాడు. ఈ వెంకాజీ శివాజీ మహారాజు కు తమ్ముడు. 1740లో బ్రిటీష్‌వారు మొదట ఆక్రమణకు ఇక్కడికి వచ్చినా విఫలం చెందారు. తరువాత 1799లో విజయం సాధించారు. ఇదీ స్థూలంగా ఈ నగర చరిత్ర..
అచ్చెరువొందే శిల్పకళానైపుణ్యం...
ఆనాడు చోళుల సామ్రాజ్యం తమిళ, కేర ళ దేశాలకే కాక దక్షిణ మైసూరు, కోస్తాంధ్ర, అండమాన్‌, లక్షద్వీప్‌, మాల్దీవులు మొదలైన ద్వీపాలకు విస్తరించి ఉంది. అప్పటికే రాష్ట్ర కూటులు తమ ప్రాభవాన్ని కోల్పోగా పశ్చిమ చాళుక్యులు విజృంభించారు. చాళుక్యులు వచ్చే నాటికే అక్కడక్కడా రాతితో ఆలయ నిర్మాణాలు, వాటిపై అందమైన శిల్పాలు శాస్తబ్రద్ధంగా పరిణతి చెందాయి. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశద్వారం ‘కేరళాంతకన్‌’, రెండో ద్వారం ‘రాజరాజ న్‌ తిరువసల్‌’, మూడో ద్వారం ‘తిరువానుక్కన్‌ తిరువసల్‌’ఈ ఆలయం సర్వ కళా శోభితమై సంస్కృత తమిళ శాసనాలున్న చారిత్రాత్మక సుప్రసిద్ధ దేవాల యంగా అలరారుతున్నది. క్రీశ 1003-14 ప్రాంతంలో మొదటి రాజరాజ చోళుడు బృహదీశ్వరాల యాన్ని నిర్మించాడు. ఈపవిత్ర ఆలయంలోకి అడుగిడగానే 13 అడుగుల ఎతె్తైన శివలింగం దర్శనమిస్తుంది.ఐదుపడగల నాగేంద్రుని నీడన స్వామి దర్శ నమిస్తాడు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణంలో ఇదొక అద్భుతమైన నిర్మా ణం. దక్షిణ విమాన నిర్మాణ కౌశలానికి, తమిళ శిల్పుల ళా నైపు ణ్యానికి పరాకాష్టగా దీనిని పేర్కొనవచ్చు. ఈ బృహదీశ్వరాలయా న్ని నిర్మించిన రాజరాజచోళుడి పేరున ‘రాజరాజేశ్వరాలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ లన్నిటి సంగమం అని చెప్పవచ్చు.
ైభారీ నంది, ఎతె్తైన శివలింగం...

ఈ ఆలయానికి ఎదురుగా బ్రహ్మాండమైన నంది శిల్పం ఉంది. రాజ రాజచోళుని తరువాత వచ్చిన రాజులు ఈ నంది విగ్రహం చుట్టూ చక్కని మండపాన్ని నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నంది విగ్రహం కంటే ఈ విగ్రహం పెద్దది. మండపం లోపలి కప్పుకి అందమైన రంగులతో డిజైన్లు చిత్రించారు. ఆ చిత్రాలు ఇప్పటికీ తమ ప్రాభవాన్ని కోల్పోకుండా అందంగా అలరిస్తున్నాయి. ఈ మండపం చాలా ఎత్తులో ఉంటుంది. బృహదీశ్వర ఆలయం విమానపు అధిష్టానం రెండు తలాలతో, మందమైన రెండు గోడల సాంధర ఆలయంగా ఉంటుంది. ఆలయం తూర్పునకు అభి ముఖంగా ఉండగా, ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో ద్వారాలున్నాయి. గర్భగు డిలో చాలా పెద్ద పీఠం, దానిమీద పెద్ద లింగం ఉంది. ఇంత పెద్ద లింగం బహు శ దక్షిణ భారతదేశంలోనే లేదేమో! రెండు గోడల మధ్య రెండతస్తులతో ప్రదక్షి ణ మార్గం కూడా ఉంది.ఇలా నాలుగు వైపులా ద్వారాలున్న ఈ ఆలయం సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు.
 అబ్బురపరిచే వర్ణచిత్రాలు...

అలాగే ఆలయద్వారానికి అటూ ఇటూ ఉన్న నిలువు గూళ్లను దేవకోష్టాలుగా తీర్చి వాటిలో దేవతామూర్తుల విగ్రహాలనుం చారు. ఇక కింది తలుపు లోపలి గోడలో దక్షిణాన శివుడు, పడమట వైపు నటరాజు, ఉత్తరాన దేవీ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రదక్షిణ మార్గపు లోపలి గోడల మీద, కుడ్య స్తంభా లమీద, ఆలయ చూరు మీద, బయటి గోడలో తట్టుమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి. ఈ వర్ణ చిత్రాలలో శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించిన కథ చిత్రాలు ఉన్నాయి. ఇంకా శివ భక్తుడై న సుందరమూర్తి కథ, చిదంబరం నటరా జు మూర్తిని రాజు పూజిస్తున్న దృశ్యం, గాయకులు, నాట్యకత్తెలు, వివిధ పక్షులు వంటి చిత్రాలను అందంగా చిత్రించారు.

ప్రాకారంలో నందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరం, ఎదురుగా మండపాలు ఉన్నాయి. ఆ పక్కనే సభామండపంలో దక్షిణాముఖుడైన నటరాజస్వామి ఉన్నాడు. ఆగ్నేయాన గణేశుడు, వాయువ్యాన సుబ్రహ్మణ్య ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి.ఇవన్నీ కూడా కాలక్రమంలో వివిధరాజులు కట్టించినవి.

బృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో నాయక రాజులు కట్టించిన సుబ్రహ్మణ్య ఆలయం ఒక మణిపూసవంటింది.బృహదీశ్వర ఆలయ ప్రాకారం లోపల ఈ ఆలయాన్ని విమాన అర్ధ, ముఖ మండపాలతో కట్టారు. నునుపైన గట్టి రాతితో కట్టిన ఈ ఆలయపు అధిష్ఠానం మీద, కుడ్య స్తం భాల మీద చాలా సూక్ష్మమైన, అందమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు అందమైన అలం కరణ లతో కనులు పండువుగా ఉన్నాయి. గర్భగృహంలో సుబ్రహ్మణ్య స్వామిని సూచిస్తున్నట్లు ఆల య గ్రీవ శిఖరాలు షణ్ముఖంగా ఉంటాయి. బహుతలములైన ఈ ఆలయపు విమాన తలం మూ లలు కూడా షట్భుజంగా ఉన్నాయి. ఈ పద్ధతి తరువాతి దక్షిణాత్య స్థపతులకు మార్గదర్శకాల య్యాయి.
సమ్మోహనభరితం... కోట ప్యాలెస్‌...
తంజావూరులో చూడదగ్గ మరో అద్భుత కట్టడం పెద్ద కోట ప్యాలెస్‌. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు ఈ ప్యాలెస్‌ను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌లో సమ్మో హనపరిచే అందమైన కట్టడాలు, విశాలమైన కారిడార్లు, గదులు, ఎతె్తైన టవ ర్లు, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలతో గది గోడలు, పరరాజుల దాడులలో రక్షణ కు ఉపయోగించే రహస్య భూమార్గాలు ఉన్నాయి.
విజ్ఞాన గని... సరస్వతీ మహల్‌
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వాటిలో ముఖ్యమైనది సరస్వతీ మహ ల్‌ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పురాతన తాళపత్ర గ్రంథాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వాటికి సంబంధించిన వివరాలున్నాయి. సంస్కృత గ్రంథాలు, వేలాది రాతప్రతులు, భారత యూరోపియన్‌ భాషలకు సంబంధించిన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయన కారుల కు, విజ్ఞానపిపాసులకు ఈ గ్రంథాలయం ఓ వరం.


త్యాగరాజస్వామికి ఘన నివాళి...
తంజావూరుకి 11 కి.మీ. దూరంలో ఉన్న ‘తిరువయూరు’ అనే గ్రామం కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలోనే ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉం ది. అనర్గలమైన సంగీత రత్నాలను అందించిన ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ‘త్యాగ రాజస్వామివారి ఆరాధన ఉత్సవాలు’ ఘనంగాజరుపుతారు. ఆరోజు ఇక్కడికి దేశం నలుమూ లల నుంచి సంగీత విద్వాంసులు వచ్చి స్వామివారికి నీరాజనాలు పలుకుతారు. ఆయన రచించి న గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది.


బృహదీశ్వరాలయానికి చేరుకోవాలంటే...
ఈ ప్రసిద్ధ ఆలయానికి చేరాలంటే... చెనై్న వరకు రైలు లేదా విమాన ప్రయాణం ద్వారా చేరుకొ ని అక్కడి నుండి బస్సు ద్వారా తంజావూర్‌ చేరుకోవచ్చు.

తొలి వెయ్యి నోటుపై బృహదీశ్వరాలయం...

1954లో మొట్టమొదటిసారిగా రూ.1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటుమీద బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది. ఈనాడు మళ్లీ ఈ ఆలయం సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ ఆ నోటు గుర్తుకు వచ్చింది.
1954లో తొలిసారిగా బృహదీశ్వరాలయం ఫొటోతో విడుదలైన వెయ్యి రూపాయల నోటు.

తపాలా ‘ముద్ర’...

రాజరాజచోళునిచే 1010వ సంవత్సరంలో తంజా వూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా, సహస్రాబ్ది ఉత్స వాలకు తపాలాశాఖ 26-9-2010 న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమినుండి స్తుపి వరకు 66మీ ఎత్తులో అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇటీవల తపాలా శాఖ విడుదల చేసిన బృహదీశ్వరాలయం పోస్టల్‌ స్టాంప్‌.