వంకాయ కూర.
ముఖ్యం గా కావలసినవి :- పొడుగు వంకాయలు (నీటి వంకాయలు)-4
ఆయిల్-100g
సాల్ట్ -2 స్పూన్స్
కారం-2 స్పూన్స్
జీరా - 2 స్పూన్స్
గార్లిక్ -3 cloves
కొబ్బరి కోరు -100g
garam masala - 1 spoon
మీకు కొంచెం spicy గా కావాలి అంటే కొంచెం ధనియాల పౌడర్ వేస్కోవచ్చు .
ఇంక రెడీ చేద్దామా మన వంకాయ రాజా గారిని. రాజ గారు ఎందుకు అంటే దేవుడే నెత్తి మీద కిరీటం పెట్టి పంపిచాడు కదా మన వంకాయ గారిని.
ఫస్ట్ పాన్ లో ఒక 10 spoons ఆయిల్ వేసి అది కాగుతుండగా,మన వంకాయల మధ్యలో పొడుగ్గా చిన్న గాటు పెట్టాలి,stuffing కి వీలు ఉండేటట్లు. అలా గాటు పెట్టక పొతే వంకాయలు నూనెలో fry అవుతున్నప్పుడు పేలే chances ఉంటాయి.ఒకవేళ వంకాయలు మరి పొడుగ్గా ఉంటే సగం కట్ చేస్కోవచ్చు నా లాగ. ఇప్పుడు కాగిన పాన్ లోకి వంకాయలు నెమ్మది గా వేసి కొంచెం సిమ్ లో పెట్టి పైన మూత పెట్టాలి.అవి నెమ్మది గా మగ్గుతాయి,ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం నెమ్మదిగా దాన్ని ఇంకో వైపుకు turn చెయ్యాలి.10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వంకాయలని ప్లేట్ లో పెట్టి కొంచెం ఆరనివ్వాలి.అవి ఆరేలోగా మిక్సి జార్ తీస్కుని అందులో ఉప్పు,కారం,గార్లిక్,గరం మసాల ,జీర,కొబ్బరి కోరు అన్ని add చేసి grind చెయ్యాలి. ఆ పౌడర్ ని ఒక పెద్ద పార్ట్ ,ఒక చిన్న పార్ట్ గా డివైడ్ చెయ్యాలి.పెద్ద పార్ట్ పౌడర్ లో కొంచెం ఆయిల్ కలిపి వంకాయల్లో stuff చెయ్యాలి. తర్వాత పాన్ లో మిగిలిన ఆయిల్ కొంచెం తీసేసి జస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ లో stuff చేసిన వంకాయలు వేసి మూతపెట్టి 5 నిముషాలు సిమ్ లో ఉంచాలి. తర్వాత వంకాయలని నెమ్మది గా తిప్పుతూ ఇంకో వైపు కూడా fry అవ్వనివ్వాలి.తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వంకాయల మీద మిగిలిన చిన్న పార్ట్ పౌడర్ ని జల్లాలి .కొత్తిమీర తో decorate చేస్కోవాలి . ఇది అన్నం తో తింటే ఆ taste స్వర్గానికి కొంచమే దూరం లో ఉన్నట్టు అన్పిస్తుంది.