ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BLACK HAIR BEAUTIFICATION TIPS




స్త్రీలకు అందం జుట్టు. తల వెంట్రుకలు వూడిపోవడం వల్ల అందం తగ్గిపోతుంది. చాలామంది ఈ సమస్య వల్ల డిఫ్రెషన్‌లోకి వెళ్ళే ప్రమాదం కూడా వుంది. సాధారణంగా కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం, ఆకు కూరలు బాగా తీసుకున్నట్లయితే శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. కొన్ని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం కొంతవరకూ తలవెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. మంచి దువ్వెనతో గానీ, తలకి ఉపయోగించే బ్రష్‌తో కానీ తల వెంట్రుకలు పాడవవు. తలవెంట్రుకలు కుదుళ్ళు గట్టిగా వుండాలంటే తలను మసాజ్‌ చేయాలి. దాని వలన రక్తప్రసరణ జరిగి చక్కటి వెంట్రుకలు వచ్చే అవకాశముంది. ప్రతిరోజు మసాజ్‌ చేయడం వలన కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు రాలిపోవు. పగిలిపోవు. ప్రతిరోజు జుట్టుకు ఆయిల్‌ రాయటం వలన నిగనిగ మెరుస్తుంది. కుదుళ్లు గట్టిగా వుండి జుట్టు పెరుగుతుంది. రాలదు. ఆలివ్‌, ఆల్మండ్‌, ఎలోవ్‌, కొబ్బరి నూనెలలో ఏదైనా వాడుకోవచ్చు. కొద్దిగా ఆయిల్‌ తీసుకొని దానిని వేడి చేసి మెత్తని బట్టను చుట్టగా చుట్టి దానిలో ముంచి వెంట్రుకలు కుదుళ్ళుకి రాయాలి. తర్వాత మసాజ్‌ చేయాలి. వేడి నీటిలో ముంచిన టవలు తలకు చుట్టుకుని ఇరవై నిమిషాలు వుంచి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఎలోవెరా ఆయిల్‌ వెంట్రుకలు పెరుగుటకు బాగా ఉపయోగపడగలదు. నూనె అధికంగా వాడడం వలన, ఎక్కువ ఆందోళన, శ్రమ, సరిగ్గా తలను దువ్వుకోకపోవటం, తలస్నానం సరిగ్గా చేయకపోవడం, అధికంగా క్రొవ్వు, వేడి పదార్థాలను తినడం వలన కూడా ఆయిల్‌ హెయిర్‌కు కారణాలు కావచ్చు. అందుచేత ఇటువంటి జుట్టు చిక్కులు పడకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి ఆయిల్‌ మసాజ్‌ చేసుకోవడం మంచిది. అలాగే వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోవాలి. హెన్నాను వారానికి ఒకసారి పెట్టుకోవాలి. వీరికి చుండ్రు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుచేత చుండ్రురాకుండా చూసుకోవటం మంచిది. తలస్నానం చేసిన తర్వాత షాంపు లేకుండా నీళ్ళతో తలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం వెంట్రుకలు రాలకుండా కాపాడుకోవచ్చు.