కావలసిన వస్తువులు మిగిలిపోయిన అన్నం - 500 గ్రాములు, క్యారెట్ దుంపలు - 8 ఉల్లిపాయలు - 8, కరివేపాకు - 2 రెబ్బలు, పచ్చిమిరపకాయలు - 10, పలావు మసాలాపొడి - 1 స్పూను, ఆవాలు - 1 టీస్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, నూనె - తగినంత, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
ముందుగా క్యారెట్ దుంపలపలను శుభ్రంగా కడిగి తొక్కును చాకుతో తొలగించాలి. తరువాత వీటిని సన్నగా తురమాలి. ఉల్లిపాయల్ని బాగా సన్నని ముక్కలుగా కోసుకోవాలి / తురుముకోవాలి. పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి స్టౌ మీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇందులో పలావు మసాలా పొడి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు కలిపి బాణలిని స్టౌమీద నుంచి కిందకు దించుకోవాలి. అప్పుడు బాణలిలోని మిశ్రమంలో మిగిలిపోయిన అన్నం కలిపి, పైన సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి.
అంతే... క్యారెట్ రైస్ రెడీ. టమోటా చట్నీ కలుపుకుని తింటే సూపర్.