ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MIXED VEGETABLE MUTTON CURRY WITH POTATOS, BEANS, CARROTS ETC - VERY HEALTHY MUTTON CURRY





కావాల్సిన పదార్థాలు: మటన్‌: అరకిలో (మధ్యస్తంగా వుండేలా ముక్కలు కోసుకోవాలి), అల్లంవెల్లుల్లి: టీ స్పూను, కారం: టీ స్పూను, పసుపు: ముప్పావు టీ స్పూను, బంగాళ దుంపలు: 2 (అంగుళం సైజు ముక్కలుగా కోయాలి), క్యారెట్లు: రెండు, పచ్చిబఠాణీ: 100 గ్రాములు, బీన్స్‌: 100 గ్రా, వంకాయలు: 4 (నాలుగు ముక్కలుగా కోసుకోవాలి), క్యాలిఫ్లవర్‌: 100 గ్రా (ఒకటిన్నర అంగుళాల ముక్కలుగా కోయాలి), కొత్తిమీర తురుము: కప్పు, పచ్చిమిర్చి: 2, పెరుగు: కప్పు(గిలకొట్టాలి), నిమ్మకాయలు: 2, నూనె: ఉడికించడానికి ముప్పావు కప్పు, వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత, గరంమసాలా కోసం: షాజీరా: పావు టీస్పూను, యాలకులు: ఒకటి, లవంగాలు: 4, దాల్చిన చెక్క: పావు అంగుళం ముక్క, మిరియాలు: 15. ఇవన్నీ కలిపి మెత్తగా పొడి చేయాలి.
తయారుచేసే విధానం
బంగాళ దుంపలు, బీన్స్‌, క్యారెట్లు అంగుళం సైజు ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో పావు కప్పు నూనె పోసి సగం అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు వేసి వేయించాలి. మటన్‌ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. విడిగా మరో బాణలి తీసుకొని అందులో డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి ఒక్కో కూరగాయ రకాన్నీ విడివిడిగా వేయించి తీసి పక్కన వుంచాలి. ఇప్పుడు నూనెలో అరకప్పు మాత్రం వుంచి మిగతాది వంపేయాలి. బాణలిలోని నూనెలో ఉల్లిముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, మిగిలిన సగం అల్లంవెల్లుల్లి, పసుపు కారం, ఉప్పు వేయాలి. ఇప్పుడు ఉడికించిన మటన్‌ ముక్కలు, వేయించిన కూరగాయ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత పెరుగు వేసి తక్కువ మంట మీద పది నిమిషాలు వుడికించాలి. చివరగా గరం మసాలా చల్లి నిమ్మకాయ రసం పిండి అతిథులకు వడ్డించాలి.