The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
IN MAHABHARATHA - LORD SRI KRISHNA LIVED 125 YEARS AND 7 MONTHS AS PER HISTORY
శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాల 7 మాసాలు జీవించాడు
కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతిగా నిలుస్తారు. విజయునికి గీతను బోధించి యుద్ధానికి సంసిద్ధం చేస్తాడు. వారికి విజయం చేకూరుస్తారు. తన వద్దకు అర్థియై వచ్చిన కుచేలుని అనుగ్రహిస్తాడు.
ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారు. ఓ దేవదేవా మీరు భూలోకంలోకి వచ్చి 125 సంవత్సరాలు అయ్యింది. ఈ అవతారం చాలించి, ద్వాపర యుగాంతంలో వైకుంఠానికి విచ్చేయాల్సిందిగా కోరుతారు. హరి సరేనని వారిని సాగనంపుతారు. ఆపైన కాలం సమీపించిందని గ్రహించిన శ్రీకృష్ణుడు యాదవులను ద్వారక నుంచి ప్రభాస తీర్థానికి పంపుతాడు. సరిగ్గా ఏడవ రోజున సముద్రుడు ద్వారకను ముంచివేస్తాడు. యదుక్షయం జరుగుతుంది. కలియుగం ఆరంభం అవుతుంది. అని శ్రీకృష్ణుడు ఉద్దవునితో అంటాడు. ఈ క్రమంలో యాదవులు మదిరాపాన మత్తులై ఒకరినొకరు సముద్రపు ఒడ్డున పెరిగి ఉన్న తుంగలో కొట్టుకుని మరణిస్తారు. అటు పిమ్మట బలరామకృష్ణులు వేర్వేరు తోవలలో మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తారు.
శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్లి ఒక నికుంజ పొద చాటున విశ్రమిస్తాడు. ఒక వేటగాడు పొదచాటున ఉన్న ఆ దేవదేవుని చరణ కమలాలను లేడి చెవులుగా భ్రమించి బాణం వేస్తాడు. ఆపైన తను చేసిన తప్పు తెలుసుకుని బోయవాడు నిలువెల్లా వణికిపోతూ శ్రీకృష్ణుని వద్దకు వస్తాడు. అయితే శ్రీకృష్ణుడు అతడిని సముదాయించి, ప్రాణములు వదిలి వైకుంఠ పద ప్రాప్తుడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాల 7 మాసాలు జీవించాడు. క్రీస్తు పూర్వము 3102 నిర్యాణ సంవత్సరము కాగా ఆ రోజే కలియుగము ప్రారంభం కావడం గమనార్హం.

TIPS TO MOMS AND DADS - KIDS FRESH SLEEPING TIPS IN TELUGU
మీ పిల్లలు సరిగా నిద్ర పోవాలంటే ?
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అని పిల్లల్ని బుజ్జగించేదుకు తల్లిదండ్రులు నానా పాట్లూ పడటం మామూలే. అయితే ఏదో బలమైన కారణాలు ఉన్నప్పుడు నసపెట్టి మారాం చేసే పిల్లలతో చిక్కు లేదు. కానీ అలవాటుగా నస పెట్టే పిల్లలందరినీ జాగర్తగా గమనిస్తే నస ప్రవర్తనకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటి కారణం పెంపకంలో లోపం కాగా రెండవ కారణం పిల్లలకు నిద్ర చాలక పోవటం.
తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పిల్లల్ని అతిగా గారాభం చెయ్యటం, మరీ సున్నితంగా పెంచటం వల్ల వారికి మొండితనం అలవాటు అవుతుంది. ఇలా పెరిగే పిల్లలకు పట్టు విడుపులు అలవాటు కావు, కుటుంబం మొత్తానికి తనే కేంద్రం అనే భావన వారిలో నాటుకు పోతుంది. దాంతో తాము ఆడింది ఆటగా పాడింది పాటగా అనుకుంటారు. వారు కోరింది సమకూర్చి పెడితే, లేదా చెప్పినట్టు పెద్ద వారు నడుడుచుకుంటే సరేకానీ లేకుంటే రచ్చకు మల్లుకుంటారు. ఇలా సమకూర్చి పెట్టటం అన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు వీలు పడక పోవచ్చు. అలాంటప్పుడు సాధించుకునే మనస్తత్వం అలవడుతున్న పిల్లలు పేచీకి దిగుతారు. అనుకున్నది సాధించు కోవటానికి తల్లిదండ్రుల మెడలు వంచ టానికి వారికి ఉన్న ఒకే ఒక దారి నస పెట్టడం జరుగుతుంది.
పిల్లల ఎదుగుదలను తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగిన పిల్లల్లో ఎదుగుదల సమస్య లతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కన పడుతుంది. అయితే తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది. చంటి పిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు అదే పెద్ద పిల్లలు నస పెడుతుంటారు.ఎవరు
ఎంతసేపు నిద్ర పోవాలనే దాంట్లో కొంత మినహాయింపులు ఉన్నప్పటికీ, నాలుగేళ్ల నుండి పదేళ్ల మధ్యన ఉంటే పిల్లలకు కావల్సిన సరాసరి నిద్ర పోయే వేళలు ఇలా ఉండాలి.
చిన్న పిల్లలు అంటే 4-5 ఏళ్ళ వయసు పిల్లలు – 11 గంటల 30 నిమిషాలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు అంటే 5-8 ఏళ్ళ వయసు పిల్లలు – 11 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు అంటే 8-10 ఏళ్ళ వయసు పిల్లలు – 10 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
నిద్ర కొరవడితే పిల్లల మనసు నిలకడగా లేక పోవటం వల్ల ఏ పని మీదా ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువయిన పిల్లల్లో పెద్ద వారిలో ఉన్నట్టే మంపుగా ఉంటుంది. జ్ఞాపకం తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఇవ్వన్నీ నిద్ర సరిగా లేనందు వల్ల పిల్లలందరిలో కనిపించే సాధారణ లక్షణాలు. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలు అయితే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. చిన్న పిల్లలు అయితే కొంత మంది మందంగా ఉంటారు. చీటికి మాటికి ఏడుస్తూ నస పెడు తుంటారు. కారణం లేకుండా ఏ చంటి బిడ్డ అయినా నస పెడుతుంటే ముందుగా ఆలోంచాల్సింది బిడ్డకు నిద్ర చాల లేదని, ఎదిగే పిల్లలకు రోజుల తరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శరీర పెరుగుదల కూడా మందగిస్తుంది.
ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరి లోనూ నిద్ర గంటలను తగ్గటానికి కారణాలు అవుతున్నాయి. టీవీ సంస్కృతి వచ్చాక చాలా మంది పిల్లలు వారికి వారుగా త్వరగా నిద్ర పోరు. సెలవుల్లో అయితే ఫరవా లేదు. కానీ బడి ఉన్నప్పుడు వారిని పొద్దునే నిద్రలేపి పంపాల్సి వుంటుంది. అలాంటప్పుడు వారికి నిద్ర చాలదు.పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయటాన్ని వైద్య పరిభాషలో 'బెడ్ రొటీన్స్' అంటారు. రాత్రి భోజనం అయ్యాక వారితో కబుర్లాడటం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోము కోవటం, స్నానం చేయించటం, పడక దుస్తులు తొడగటం లాంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి.
పడక మీదకు చేరానే బొమ్మల పుస్తకాలు తిరగెయ్యటం, కథలు చెప్పించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఈ పనులన్నీ ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమం మారకుండా ప్రతి రోజూ చేయించాలి. ఈ మొత్తం ప్రహసనం కనీసం అర గంటకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా చేయించటం వల్ల ఆ పని మొదలు పెట్టినప్పటి నుండి వారికి తెలియ కుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయటం వల్ల వారిలో నిద్ర వేళలు గట్టి పడతాయి. కొన్ని పద్ధతులను పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడ వచ
్చు.
1.వయస్సుకు తగ్గట్టు పిల్లల్ని నిద్ర పోయేటట్టు అలవాటు చేయాలి
2.సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి.
3.సెలవుల్లో పిల్లలు నిద్ర వేళలు క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, బడి తెరవటానికి కనీసం వారం రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.
4. పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్ర వేళకు అర గంట ముందు వాటిని చూడనీయకూడదు. అరగంట ముందు చదవటం, హోం వర్కు చేయటం నిలిపేయాలి.
5.సాయంత్రాలలో, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగర్తలు పాటించాలి. సాయం కాలం తరువాత చాకోలేట్లు కోలా డ్రింకులు తాగనీయ వద్దు. వీటిలో ఉండే కీఫిన్ రోజువారీ నిద్రను చెడ గొడుతుంది.
6.పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలు నేర్పించాలి. 'బెడ్ రొటీన్స్' అలవాటు చేయాలి
EAT DRY FRUITS DAILY TO OVERCOME DENTAL, EYES PROBLEMS AND GIVES POWER TO BONES ETC
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్మిస్ పండ్లు తినుటవలన యూరినల్లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కిస్మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.
" ఆరోగ్యకర ఉపయోగాలు "
1.దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది .
2.కండ్ల కు మంచిది : ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది .
3.ఎముకులకు రక్షణ : కాల్సియం , బోరాన్ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది .
4.సెక్షువల్ వీక్నెస్ : లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును .
5. జ్యరము : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది .
6. రక్తహీనత : ఒక మోతాదులో ' ఐరన్ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును .
7. ఎసిడోసిస్ : ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును .
8. శరీర బరువు : కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది .
9. మలబద్దకం : ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది .

Subscribe to:
Posts (Atom)