చికెన్ సీక్ కబాబ్
కావాల్సినవి:
చికెన్ కీమా - 300గ్రా
అల్లం- 25గ్రా
పచ్చి మిర్చి- 25గ్రా
కొత్తి మీర- ఒక కట్ట
గరం మసాల- 2గ్రా
పెరుగు మీగడ-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి,తరువాత దానిలో సన్నగా తరిగిన అల్లంముక్కల్ని,పచ్చిమిర్చి ముక్కల్ని ,కొత్తిమీర, గరం మసాల పొడి వేసి ,తగినంత ఉప్పు,పెరుగు మీగడ కలిపి ఉంచండి.
2) కొంచెం మందంగా ఉన్న ఇనుప చువ్వను తీసుకుని దానికి చుట్టూరా ఈ చికెన్ కీమా మిశ్రమాన్ని ఎనిమిది అంగుళాల పొడవునా చేతితో పట్టించండి.
3) ఇప్పుడు బొగ్గుల కుంపటి ఫై ,నిప్పులు ఎర్రగా తయారయ్యాక చికెన్ మిశ్రమం అంటించిన ఇనుప చువ్వలను నిప్పు సెగ చూపుతూ ,కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేవరకు వుంచండి.తరువాత చువ్వ నుండి కబాబ్ ను కిందికి లాగి,ప్లేట్ లో అమర్చి ,ఉల్లిపాయ ,నిమ్మ కాయ చక్రాలతో అలంకరిస్తే చికెన్ సీక్ కబాబ్ రెడీ.....