ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

COVA PURI - SWEET DISH

కోవా పూరి

కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార- ఒక కే జి
పచ్చి కోవా- 250 గ్రా
జాపత్రి-2 గ్రా
యాలకులు- 2గ్రా
సెనగ పిండి- 50 గ్రా
వంట సోడా- పావు టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్
నెయ్యి- 125 గ్రా
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) పచ్చి కోవాకు సెనగపిండిని కలిపి ఒక గిన్నె లో కొంచెం వేయించి దించి దానిలో జాపత్రిపొడి ,యాలకుల పొడి,కొంచెం చక్కెరకలిపి ముద్ద చేసి వుంచుకోవాలి. 2) ఒక బాణలి లో మిగిలిన చక్కెరను పోసాక-రెండు గ్లాసుల నీళ్ళు పోసి జిలేభి పాకంలా లేతగా వచ్చే వరకు ఉంచి దించి పక్కన పెట్టండి. 3 ) మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించండి. దానిలో - కరగబెట్టిన నెయ్యి కలిపి ,రెండు చేతులతోనూ పిండిని బాగా కలిపి తగినన్ని నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా తయారు చేసుకోండి.
4 ) తరువాత నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకొని ,మద్య లో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి ,అంచులను తడి చేసి,కోవాకు దగ్గరగా అంచులను చుట్టి కజ్జి కాయలా మడత పెట్టండి.
5) ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి,చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ....