మినీ స్ప్ర్రింగ్ రోల్స్
కావలసినవి :
మైదా - 250 గ్రాగుడ్లు -ఒకటి
ఉప్పు-తగినంత
పాలు- 100 మీ.లీ
ఉల్లిపాయలు - 100 గ్రా
కాప్సికం - 100 గ్రా
సోయా సాస్ - టేబుల్ స్పూన్
చిల్లి సాస్ - టేబుల్ స్పూన్
అజినమోతో -చిటికెడు
అజినమోతో -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసీ విధానం :
1 )మైదా పిండి లో కోడి గుడ్లు ,పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయండి .
2)ఒక పాన్ ను తీసుకుని వేడి చేయాలి. తరువాత బయటకుతీసి దాన్ని బయటకు తీసి ,గరిటెడు పిండి పోసి,చుట్టూ తిప్పి పలుచటి చిన్న పాన్ కేకు మాదిరిగావేయండి.తరువాత మళ్ళీ పాన్ ను పొయ్యి మీద ఉంచండి. ఈ కేకును టేబుల్ మీద చపాతిలా పరచండి.
3)ఒక పాన్ లో కొంచెం నూనె పోసి,ముందుగా ఉల్లిపాయ,కాప్సికం ముక్కలు వేసి వేయించండి.అందులో కొంచెం సోయా సాస్,చిల్లి సాస్,అజినామోతో ,తగినంత ఉప్పు వేసి పొడి కూర తయారు చేయండి.ఆ పైన, ఈ పొడి కూరను పాన్ కేకుల మీద పెట్టి ,ఒక్కో కేకు ను ,కొంచెం మడత పెట్టి కప్పి,ముందు నుంచి చాపలా చుట్టి గుడ్డు సోనతో అతికించి ,వేడినూనె లో ఫ్రై చేయండి.మినీ స్ప్ర్రింగ్ రోల్ల్స్ రెడీ ... వీటిని టమోటా సాస్ తో సర్వ్ చేయాలి........