ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ONION GARELU

ఉల్లి గారెలు

కావాల్సినవి:
మినపప్పు- 500 గ్రా
ఉల్లిపాయలు- 250 గ్రా
అల్లం- చిన్న ముక్క
పచ్చి మిర్చి- పది
కరివేపాకు- పది రెబ్బలు
ఉప్పు-తగినంత
నూనె-వేయించడానికి సరిపడా


తయారు చేసే విధానం:
1) మినపప్పును కడిగి నానబెట్టండి. రెండు గంటలతరువాత దీన్ని గట్టిగా ఉండేలా గ్రైండ్ చేయండి.(అంటే పప్పు పలుకుగా ఉండాలి)తగినంత ఉప్పు కలపండి.గ్రైండ్ చేసే ముందు నీళ్లు ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
2 ) ఇప్పుడు తరిగిన అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ,ఉల్లిపాయముక్కలు,కరివేపాకు గ్రైండ్ చేసిన పిండిలో కలపండి.
3 ) ఈ పిండిని ముద్దలుగా చేసి తడిచేతి మీద పలుచగా అద్ది -బాణలిలో కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించండి. అంతే ఎంతో రుచికరం అయిన ఉల్లిగారెలు రెడీ..ఇవి కొబ్బరి చట్నీ తో తింటే చాలా బావుంటాయి....