ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PALAK PAKODI

పాలకూర పకోడీ

కావాల్సినవి:
పాలకూర-పది కట్టలు
సెనగపిండి-200 గ్రా
కారం పొడి-ఒక టీ స్పూన్
వంట సోడా-పావు టీ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
పసుపు-చిటికెడు

తయారు చేసే విధానం:

1)ముందు గా పాలకూర కాడలను తుంచాలి.ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి ఉంచండి .
2 )ఇప్పుడు సెనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నె లో జల్లించి దానికి తగినంత ఉప్పు,కారం,పసుపు,వంటసోడా కలిపి,నీళ్ళతో జారుడుగా బజ్జీల పిండిలా కలపండి.ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కలిపి బాణలిలో ఎర్రగా వేయించి,ప్లేట్లలో అమర్చి అతిధులకు అందించండి.