షాహీ మాటర్ పనీర్
కావలసినవి:
పనీర్ - 200 గ్రా
పచ్చి కోవా - 50 గ్రా
పచ్చి బఠానీలు -75 గ్రా
పచ్చి మిర్చి-ఐదూ
కోతి మీర -ఒక కట్ట
ఉల్లి పాయలు - 50గ్రా
జీడి పప్పు -20 గ్రా
గసగసాలు- 20 గ్రా
పెరుగు -అర కప్పు
కారం-అర టీస్పూన్
ఉప్పు-తగినంత
నూనె - 75 గ్రా
తయారు చేసీ విధానం
1)ఒక గిన్నెలో నూనె వేడిచేసి,ముక్కలు గా తరిగిన పనీర్ ను ఎర్రగా వేయించి తీసి ఉప్పు నీటి లో నానబెట్టండి.
2)అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగావేయించాక,తురిమిన అల్లం,పచ్చి మిర్చిలను ,కారం,ముద్ద గా నూరిన జీడిపప్పు, గసగసాలమిశ్రమాన్ని కొంచెం ఫ్రై చేసి పెరుగును కలపండి.అవసరం ఐతే కొంచెం నీళ్లుపోసి గ్రేవి లా మరిగించండి.దీంట్లో పనీర్ ముక్కలు ,పచ్చి కోవా ,ఉడికించిన పచ్చి బటానీలు ,గరం మసాల వేసి ఉప్పు సరి చూసుకోండి. తయారైనా షాహీమాటర్ పనీర్ మీద కోతిమీర జల్లి వేడి వేడి పరోటాలతో వడ్డించండి ......