ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUNERI BENDI - LADIES FINGER RECIPE

సునేరి భేండి

కావాల్సినవి:

బెండకాయలు- 250 గ్రా
సెనగపిండి- 50 గ్రా
కారం- అర టీ స్పూన్
చాట్ మసాలా- అర టీ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 ) బెండకాయలను చాకుతో అడ్డంగా రెండు ముక్కలుగా కోసి మళ్లీ నిలువుగా రెండు ముక్కలుగా చీల్చండి.
2) ఈ ముక్కల్ని ఒక వెడల్పు గిన్నెలో వేసి-సెనగపిండి ,కారం,చాట్ మసాలా,తగినంత ఉప్పు,కలపండి.తరువాత కొంచెం నీళ్లు పోసి కలపండి.
3 ) ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాచాక-సెనగపిండి మిశ్రమంలో వున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసి తీస్తే సునేరి భేండి రెడీ... దీనికి వేయించిన జీడిపప్పు కూడా కలిపితే చాలా బావుంటుంది.