ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ABOUT IMPORTANCE OF BHOGI FESTIVAL WHICH COMES 1ST DAY OF SANKRANTHI FESTIVAL


భోగి ప్రాముఖ్యత


సంక్రాంతి పండుగ మొదటిరోజుని "భోగి" అని పిలుస్తారు .ఈ రోజున పెద్ద చలి మంటలను వేస్తారు .సాయంకాలం పూట పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు .ఓ చక్కని పేరంటాన్ని ప్రతీ ఇంటా చేస్తారు .



చలిమంట మనకో రహస్యాన్ని చెపుతుంది .మనకు ప్రతీరోజూ కనిపించే నిప్పుముద్దైన సూర్యుడు రేపటినుండీ తన వేడిని పెంచుకొంటూపోతూ మరింత మంటని మనకు కల్పిస్తాడు అనేది.



ఆవు పేడతో పిడకలు చేసి వాటిని ఈమంట లో వేస్తే, ఇక హేమంతఋతువులో ఉండే మంచుకి ,చలికి ఉండే మన శరీరానికి హానికరమైన క్రిములు ఎలా పుట్టయో అవన్నీ ఈరోజు వేసే చలిమంటకి ఆకర్షించపడి తమంత తాముగా ఆ మంటల్లో పడి చనిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చెయ్యనివ్వకుండా చేస్తాయి . 



ఇంతే కాకుండా మన ఇంటి లోని అనవసరమైన వస్తువులను ఈమంటల్లోకి మనం వేస్తున్నందున ఇల్లు పాత వస్తువులు లేకుండా శుభ్రము గా కనిపిస్తుంది .

సాయంకాలం పిల్లలకి భోగిపళ్లు పోస్తున్న వంకతో రేగిపళ్ళను ఆశ్వీర్వచనాలతో ముత్తైదవలందరూ చిన్నపిల్లలకు తలమీదుగా నేలకు పడేలా పోస్తారు . . సంస్కృతం లో రేగిపండుని అర్కఫలం అంటారు .అర్క అంటే సూర్యుడు అని అర్ధం . ఈ రేగి పండు సూర్యుడిని తన పేరుతోను ,రూపంలోను కూడా పోలి ఉంటుంది .ఈ రేగిపళ్ళను తల మీదగా పిల్లలకు పోయడమంటే ఆ సూర్య శక్తి సంపూర్ణం గా మీ శరిరాలమీదఉండుగాక !అని ఆశీర్వదించడమూ అని దీని భావమన మాట .