మహా శివరాత్రి
4
శిభక్తులు ఈ పండుగనాడు తెల్లవారు ఝాముననే నిద్ర లేస్తారు. ఇళ్ళలోను, గుళ్ళలోనూ కూడ శివపూజలు, శివాభిషేకములు చేస్తారు. ఈ రోజు ‘ఉపవాసం’, రాత్రి ‘జాగరణ ‘చేస్తారు. (రాత్రి అంతా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు. మరునాటి ఉదయం యధావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి (శివునికి) అర్పించిన ఆహారాన్ని తింటారు.)
శివరాత్రి మహాత్యము:
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
రోజు సంధ్యాసమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం పఠించి, తేనే కలిపిన పాలు నివేద్యం పెట్టండి. ఇలా ఒక మండలం(40 or 41) రోజులు కానీ రోజు కానీ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది.
సోమవారంనాడు శివాలయంలో పొద్దున్న సమయంలో తేనే, పాలు ఇవ్వండి.
ప్రతి సోమవారంనాడు కనీ, 16 సోమవారాలు కానీ సోమవర వ్రతం చేయండి ఫలితం లభిస్తుంది.
somavara vratham pdf