ఆడవాళ్ళ చేతికి గాజులే అందం
ఆడపిల్ల అందాన్ని వర్ణించేటప్పుడు తామర తూడుల్లాంటి చేతులకు ముత్యాల గాజులు, బంగారు కడియాలు అంటూ చెబుతారు. అవును మరి వయ్యారాలొలికే నెలతకు సొగసైన చేతులు, వాటికి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే గాజులు అవసరమే కదా! ఒకప్పుడు చేతినిండా మట్టిగాజులు లేదా బంగారు గాజులను వేసుకునే వారు.
క్రమేపీ వివిధ రకాల మెటీరియల్స్‌తో తయారైన గాజులను ధరిస్తున్నారిప్పుడు. మెటల్, చెక్క, దంతం, ప్లాస్టిక్ ఇలా ఎన్నోవెరైటీలు. కాళ్లకు తొడిగే గజ్జెలు మాత్రమే ఘల్లుమనాలా? ముంజేతులకు రతనాల గాజులు కూడా ఘల్లుమంటూ గుండె ఝల్లుమనిపిస్తాయి అంటూ అమ్మాయిలు మువ్వల గాజులను ధరిస్తున్నారు.
సెట్‌గా లభించే ఈమెటల్ గాజులను చూడండి. వేళ్లాడే మువ్వలతోచూడముచ్చటగా ఉన్నాయి కదూ! గోల్డ్ సిల్వర్ కలర్‌లో లభించే ఈ సెట్‌లను ఎక్కువగా పార్టీవేర్ యాక్ససరీస్‌లో వాడుతుంటారు. ట్రెడిషన్ డ్రెస్‌లపై బాగా సూటౌతాయివి. లంగా ఓణీలపైన, చీరలకు, పట్టు చుడీదార్‌లపై వీటిని వేసుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్‌గా చెబుతారు.ఇంకేం మీ చేతులకు కూడా వీటిని సింగారించుకుని మురిసిపోయేందుకు సిద్ధమవ్వండి.