ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BREAKFAST SPECIAL COCONUT POORI


కొబ్బరి పూరీలు

కావలసిన పదార్ధాలు:
మైదా – 2 cups
గోధుమ పిండి – 1 cup
నూనె – 1 tbsp
తురిమిన కొబ్బరి – 1 cup
పెసర పిండి – 1/2 cup
నూనె – 2 tbsp
కరివేపాకు – 1 tsp
పచ్చిమిర్చి – 2
అల్లం – 1 tsp
కారం – 1 tsp
ఆవాలు – 1 tsp
జీలకర్ర – 1/2 tsp
ఇంగువ – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడ
తయారు చేయు విదానము:
1. ముందుగా మైదా, గోధుమపిండి, నూనె, ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి అవాలు, కరివేపాకు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జిలకర్ర, ఇంగువ వేయించాలి.
3. ఇప్పుడు తురిమిన కొబ్బరి, పెసరపిండి, కారం, ఉప్పు, వేసి బాగా వేపి కొద్దిగా నీరు పోసి మళ్ళీ కొద్ది సేపు వేపి స్టౌ మీద నుండి దింపి పక్కన పెట్టుకోవాలి.
4. చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కలిపి పెట్టుకొన్న మైదా, గోధుమ పిండిని కూడా కాస్త పెద్ద ఉండలుగా చేయాలి.
5. ఒక్క పిండి ముద్ద చేతితో వెడల్పుగా చేసి అందులో కొబ్బరి ఉండ పెట్టి మూసేసి పూరీల్లా చేసుకుని వేడి నూనెలో కాల్చాలి. అంతే కొబ్బరి పూరీలు రెడీ అయితే వీటికి పచ్చడి అవసరం ఉండదు. కావలనుకొనే వాళ్ళు ఆలూ తో చేసిన ఫ్రైతో తింటే చాలా రుచిగా ఉంటాయి