వెరైటీ ఎగ్ ఫ్రై
ఎగ్స్ తో కర్ర్రీ అనగానే సాధారణంగా పొరటు కానీ,బాయిల్డ్ ఎగ్ కూర
కానీ చేస్తాము కదా.ఎప్పుడూ అదే కాకుండా ఇలా చేస్తే వెరైటీ గా
ఉంటుంది.రైస్ లోకి అయినా చపాతి లోకి అయినా బావుంటుంది
కానీ చేస్తాము కదా.ఎప్పుడూ అదే కాకుండా ఇలా చేస్తే వెరైటీ గా
ఉంటుంది.రైస్ లోకి అయినా చపాతి లోకి అయినా బావుంటుంది
కావలసిన పదార్ధాలు:
ఎగ్స్ మూడు
ఉల్లిపాయ ఒకటి
టమాటాలు రెండు పెద్దవి
మిర్చి రెండు
అల్లంవెల్లుల్లిముద్ద అరస్పూను
గరంమసాలా పొడి ఒక స్పూను
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర అర కప్పు
ఉప్పు,కారం తగినంత
నూనె రెండు టేబుల్ స్పూన్లు
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,జీలకర్ర.
తయారు చేసే విధానం:
ముందుగా ఎగ్స్ ఒక గిన్నెలో వేసి బాగా బీట్ చెయ్యాలి.తరువాత
కొంచెం ఉప్పు,కారం వేసి ఇంకోసారి బీట్ చెయ్యాలి.
ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి ఆవిరి మీద ఉడికించి, చల్లారాక
ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి తాలింపు వేసి ,కరివేపాకు ,సన్నగా తరిగిన ఉల్లి మిర్చి
ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఇప్పుడు తరిగిన టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి.తరువాత ఉప్పు,
కారం,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించాలి.
కూర దగ్గరవుతుండగా ఎగ్ పీసెస్ ని వేసి గరం మసాలా పొడి వేసి
బాగా కలిపి ఒక నిమిషం తరువాత దించెయ్యాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డిస్తే కమ్మని ఎగ్ ఫ్రై రెడీ.
ఎగ్స్ బీట్ చెయ్యడం,ఉడికించడం పని అనుకుంటే సింపుల్ గా ఆమ్లెట్
వేసి ఆ పీసెస్ తో ఈ కర్రీ చేసుకుంటే ఆమ్లెట్ కర్రీ సిద్దం.