ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

COOL COOL SABJA GRAINS - REDUCES SO MANY WATER DEFICIENCES EITHER IN HOT WEATHER OR OTHER DEFICIENCIES - USE IT


చల్ల చల్లని సబ్జా

ఎండా కాలంలో చెమట రూపంలో శరీరంలో నీరంతా బయటకు పోతుంది. ఒంట్లో నీటి శాతం పడిపోయినప్పుడు వేడి పెరుగుతుంది. జ్వరం వచ్చిన భావన కలుగుతుంది. పదే పదే దాహంగా ఉండడం, మూత్రం తక్కువగా రావడం, ముక్కు వెంట రక్తం కారడం, తలతిరిగి పడిపోవడం… వంటివన్నీ జరుగుతాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శారీరికంగా బలహీనంగా ఉన్నవారు వడదెబ్బకు గురవుతారు. జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి విషమించే ప్రమాదమూ ఉంది.
జాగ్రత్తలు:
ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంత మంచిది.
మంచినీళ్లలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు, పటిక, పంచదార వేసి తరచూ స్వీకరిస్తూ ఉండాలి.
చిన్నపిల్లలకు పళ్లరసాలు, జావలు పుష్కలంగా ఇవ్వాలి.
వేసవితాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సబ్జా గింజలు బాగా దోహదం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ గింజల్లో ఉండే ఔషధం విలువలేంటి…? వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం చూద్దాం…
సబ్జాగింజలు:
వీటిని ‘రుద్రజడ’ గింజలు అని వాడుకలో అంటారు. సహజంగా వీటిలో ఉండే సుగంధ తైలాలు శరీర తాపాన్ని తగ్గించే చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ముందుగా ఈ గింజలను నానబెట్టాలి. పళ్లరసాల్లో, పాలలో, మజ్జిగలో, కొబ్బరినీళ్లలో… ఆ నీటితో సహా కలుపుకుని ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్లు తీసుకోవచ్చు.
ఔషధ విలువలు
శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
చెమటకాయలు రాకుండా కాపాడుతుంది.
చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చేంచాడు నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది.
వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.
ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
రోజూ ఒకటి, రెండు టీస్పూన్ల గుజ్జును నీటిలో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగితే మలబద్దకం తగ్గుతుంది.