దీపావళి
దీపావళి పండగ దీపాల పండగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
దీపావళి రోజు బాణా సంచా కూడా కాలుస్తారు.
ఈ పండుగ అక్టోబరు లేదా నవంబరు నెలలో వస్తుంది.
తెలుగు క్యాలెండరు ప్రకారం, ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు.
అంతకు ముందు రోజు, అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు, నరక చతుర్దశి అంటారు.
ఆ రోజు శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అంటారు.
అప్పుడు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారట.
దీపావళి రోజు బాణాసంచా కూడా కాలుస్తారు.
చిచ్చుబుడ్లూ, మతాబులూ, కాకరపువ్వొత్తులూ, భూచక్రాలూ, విష్ణు చక్రాలూ రంగు రంగుల వెలుగులని విరజిమ్ముతాయి.
టపాకాయలూ, సిసింద్రీలూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాయి.
దీపావళి ప్రార్థన |