మహా నటి సావిత్రి ఒక లెజెండ్
మహా నటి సావిత్రి ఒక లెజెండ్
సిని ప్రపంచంలో ధ్రువతారలా ఎప్పటికి నిలిచి వుండే మరపురాని నటిమణి సావిత్రి.
(మహానటి సావిత్రి జన్మదిన సందర్భం గా ఈ చిరు నివాళి.)
మహానటి సావిత్రి నటజీవితం ఒక మహాకావ్యం(ఒక లెజండ్)జగతి మరువలేని అందాల నటి సావిత్రి నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలుమారినా ఆమె జీవించిన చిత్రరాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ మరువలేనివి.తెలుగు చిత్ర రంగంలోతిరుగులేని నటీమణి.పుట్టిననెల... గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. డిసెంబరు6,1937, మరణం 26, శనివారం 1981.వారి జీవిత కాలం 44సంవత్సరాలు మాత్రమే(చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె సినీ జీవితంలో అత్యన్నత స్ధానాన్ని అధిరోహించినా చివరికి నిజ జీవితంలో అతిఘోరంగా విఫల మైన ఆమె జీవితం అందరికీ ఒక పాఠం కావాలి.)
బాల్యంగుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చింది. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటకప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత నవభారత నాట్యమండలి అనే నాటక కంపెనీని స్ధాపించారు.బుజ్జిబాబు రచించిన ఆత్మ వంచన నాటకం ప్రసిద్ధి చెందింది.
12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి సంసారం సినిమాతో మొదలయింది.అనంతరం పాతాళభైరవిలోనూ నృత్యపాత్రలో కనిపించిన ఆమె చిన్నచిన్న పాత్రలు చేసినా ఆమె పెళ్ళిచేసి చూడు, అర్ధాంగి, మిస్సమ్మ ఇలా ఎన్నో సినిమాలలో మంచి నటిగా గుర్తింపు పొందింది.వివాహ జీవితం
13 ఏళ్ళ వయసులోనే సావిత్రి జెమిని గణేశన్ ని మొదటి సారి చూసారు. యువకుడు, అందగాడు అయిన ఆటను జెమిని స్టుడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్ సావిత్రి స్టిల్ ఫొటోస్ ఆయనే తీసారు. అతనికి అలమేలు, పుష్పవల్లి అని ఇద్దరు భార్యలు,పిల్లలువున్నారు
జెమిని గణేశన్ తో జంటగా |
ఆమె తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.
1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటి ఆమె ఆపాత్రకి సరిపోరనిచిన్న పిల్లని.ఇంకామెచ్యూరిటీ కావలసి వస్తుంధని ఆసినిమాలో ఆమె ఎంపిక కాలేదు. ʻమనంపోల మాంగల్యమ్ʼ తమిళ్ సినిమా (1953)లో నటించారు. హీరో జెమినీ గణేష్. ఆసమయంలోనే ప్రేమ మత్తులో పడి పద్దెనిమిది ఎల్లా వయసులో 1953లోనే ఆమె జెమినీగణేష్ ని ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. మూడేళ్ళ తరువాత ప్రపంచానికి తెలిసింది వారి పిల్లలు అయిన కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ తో పెంచారు.
టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు.
మాయాబజార్లో శశిరేఖ పాత్ర అంటే సావిత్రిలా వుంటుంది అనిపిస్తుంది. మిస్సమ్మలో మిస్ మేరి కూడా తక్కువేం కాదు.
కదాబలం, తారా బలంతో పాటు సావిత్రి నటన ఆ చిత్రానికి హైలైట్గా నిలిచింది. ఇప్పటికి ఆ చిత్రాలు ఏ చానెల్ లో వచ్చినాకళ్ళప్పగించి చూసే వారు చాలామందే వున్నారు. మహా నటి అంటే సావిత్రే! ఇంకొకఋ ఎవరు ఆ స్థానం పొందలేరు, ఆక్రమించలేరు.
ఆమె సహజ నటి. ఎటువంటి పాత్రనైన సులువుగా నటిస్తుంది. ఒకే టేక్ లో పూర్తీ చేస్తుంది. ఎక్కువ టేక్ లు చెప్పడం, రీల్ వేస్ట్ చేసేవారు కాదు పాత్రలలో లీనమై నటించేవారు. షూటింగ్ పూర్తీ అయినా ఇంకా అదే మోషన్ లో ఉండేవారు
ఇక ఈ సీన్ లోనైనా కన్నీరు కార్చవలసి వస్తే గ్లిసరిన్ వాడే వారు కాదు. చాల కంట్రోల్ గా ఈ కన్ను లోనించి ఎన్ని బొట్లు నీరు రావాలన్న అంటే రప్పించేవారు. కంటి చూపుతో నయగారాలు,చిన్నపెదవి విరుపుతో భావాలు, ఎంతని వర్ణించిన తరగని అందం అమెది.
తరగని ఆస్తి ... కానీ ...
కోట్ల విలువ చేసే నాలుగు బంగ్లాలులతో పాటు కొడైకెనాల్ లో, విజయవాడలో, హైదరాబాడ్లలో
భవంతులు,కృష్ణా జిల్లాలో విజయ్ స్పిన్నింగ్ మిల్స్, వ్యవసాయ ఎస్టేట్ల తో పాటు సావిత్రి ప్రొడక్షన్స్ అనే సినీ ప్రొడక్షన్ కంపెనీ వుండేది. ఆరు కార్లు ఇంటినిండా పనివారు..అంతా వైభోగమే. అన్ని కుడా ఆమె తన నట జీవితంలో సంపాదించినవే! తన భర్త నుంచి ఏమిఆశించలేదు. ఆమె దినసరి ఆదాయం ఐదువేల పైనే ఆ రోజుల్లో. ఆమె ఏడాదికి ఎనిమిది లక్షలకి పైగా ఆదాయపు పన్ను కట్టేవారు..
కానీ సినిమాలు తీసి భారీగా నష్టపోవటం, లక్షలకి లక్షలు దానాలు ఇవ్వటం, మత్తు పదార్ధాలకి బానిస కావటం, సంపాదించిన దానిపై అజమాయిషీ లేకపోవటం, 1972 తరువాత సిని అవకాశాలు తగ్గిపోవటం, భర్తతో విబేధాలు, మానసిక క్రుంగుబాటు.... అన్ని కలిసి ఆమె జీవితాని అధ పాతాళానికి నెట్టి వేసాయి. అంతటి ఆస్తిపరురాలు చివరికి అద్దె ఇంట్లో వుంటూ,
నె ల్లతరబడి కోమాలో వుంటూ చాల భాదాకరమైన జీవితాన్ని అనుభవించారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడిన ఆమె జీవితం నేలకి ఒరిగిన కడలి తరంగంలా అయింది.
సినీ సామ్రాజ్ఞి....తెలుగు వారు మరచిపోలేని పాత్ర దేవదాసులోని పారు. ఆచిత్రం చాలామంది వందల సార్లు వీక్షించారు.ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే మాయాబజార్ లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ ʻఅహనా పెళ్ళంట....ʼ పాటని ఆసన్నివేశాన్ని మరువలేరు ఎవరూ. చూపులతోనూ, పెదవి కదలికలతోనూ తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. నర్తనశాల, శ్రీకృష్ణపాండవీయం, సుమంగళి, నాదీ ఆడజన్మే, నవరాత్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. దొంగరాముడు, తోడికోడళ్ళు, అభిమానం, మురిపించేమువ్వలు,(1960) మంచిమనసులు(1961), డా. చక్రవర్తి (1964) దేవత(1965) మనసే మందిరం (1971)... ,వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు.తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు.హిందీలో....బహుత్ దిన్ హుమై, ఘర్ బసాకే దేఖో, బలరామ్ శ్రీకృష్ణ, గంగాకి లహరే... మొదలైనవి.సావిత్రిని దక్షిణాది మీనాకుమారిగా అభివర్ణించేవారు.దర్శకురాలిగా...మాతృదేవత, వింత సంసారం, చిన్నారి పాపలు, చిరంజీవి మొదలైన చిత్రాలు.నిర్మాతగా...చిన్నారి పాపలు, ఏక్ చిట్టీ ప్యార్ భరీ చిత్రం బాగుందన్నా... ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది.గాయనిగా..నవరాత్రి సినిమాలో ఒక పాట పాడారు.మానవసేవే మాధవ సేవ...అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి. అధిక భాగం ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేది.లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీద నున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చింది.అభిరుచులు...ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ.పిల్లలని ప్రేమతో చూసుకునేది.అవార్డులు...తమిళ్ రాష్ర్ర ప్రభుత్వంచే కలైమామణి...తనడిగర్ తిలగమ్... నటశిరోమణి...ఎన్నో అవార్డులు అందుకున్నారు....మహానటి.... ఉత్తమ నటీమణి...
ఎవ్వరూ ఇవ్వలేని అవార్డు..
ʻʻప్రజల హృదయాలలో చిరంజీవిʼʼ
అంతిమ జీవితం.....ఆమె ఎంతో ఇష్టపడి, ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె వివాహం జీవితం ముళ్ళబాటలోనే నడిచింది. నమ్మిన వ్యక్తులు మోసపుచ్చి, నట్టేట ముంచారు ఆమెను. ఎంతో సుసంపన్నురాలైన ఆమె వ్యాపారాలపేరిట, మోసాలపేరిట, దానాలపేరిట సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. వివాహం సంబంధాలు ఇరువురి మధ్య తెగిపోయాయి. జీవితంలో తట్టుకోలేని సమస్యలు, మెంటల్ టెన్షన్ లు ఎక్కువయ్యాయి. చివరికి వ్యసనాలకి బానిస అయ్యారు. ఆల్కహాలు, నిద్రమాత్రలు, డ్రగ్స్ ఇత్యాది వాటికి అలవాటు పడ్డారు. అనేక మార్లు ఆస్పత్రిలో చేరి చికిత్సనూ పొందారు. డాక్టర్లు మత్తు పదార్ధాలు వలదని వారించినా ఫలితం లేకపోయేది.
చివరిసారిగా ఆమె బెంగుళూరు సమీపంలో తెలుగు చిత్రానికి షూటింగ్ లో పాల్గొనటానికి వెళ్లి(మత్తులో) పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్ధురాలు కూడా అయిన ఆమె అంతిమ దశలోకి (టర్మినల్ కోమా) చేరుకున్నారు. ఇద్దరు పిల్లలు, నర్సు సంరక్షణలో, అద్దె భవనంలో, అతి భయంకరమైన పరిస్ధితిలో.... దాదాపు 18 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబరు 26 శనివారు రాత్రి 11గం.లకు (1981)లో తుది శ్వాస విడిచారు. ఆమె మరణించడానికి ముందు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ గోల్డెన్ కమిటీ ఆమెకి 10,000 రూపాయలు విరాళం అందింది. అవి ఆమె వైద్యానికి ఎంత మాత్రం సహాయ పడేవో అర్ధం కాదు...