చైనీస్ పావ్ భాజి
మహారాష్ట్రలో చాలా ప్రముఖమైన వంటకం ఈ పావ్ భాజి. దీనిని శనగలు, బఠానీలు, కూరగాయలు, పావ్ భాజి మసాలా పొడితో తయారు చేస్తారు, అనుకోగానే చేయలేం. కాని అనుకున్నవెంటనే. కొద్దిపాట దినుసులు, కూరగాయలతో కొత్తరకం పావ్ భాజి చేసుకోవచ్చు. అది కూడా చైనీస్ స్టైల్ లో..ఎలాగో చూద్దామా మరి..
కావలసిన వస్తువులు:
ఉల్లిపాయ తరుగు – 1/2 కప్పు
సన్నగా తరిగిన కాబేజి, క్యారట్, కాప్సికం, టమాటా – 1/2 కప్పు
అజినొమొటొ – చిటికెడు
ఉడికించిన కార్న్ గింజలు – 1/4 కప్పు
ఉడికించిన బంగాళదుంప – 1
ఉడికించిన నూడుల్స్ – 1/2 కప్పు
ఎండుమిర్చి – 4
వెల్లుల్లి – 5
టమాటా సాస్ – 2 tsp
సోయా సాస్ – 1 tsp
మిరియాల పొడి – 1/2 tsp
ఉప్పు – తగినంత
ఉల్లి పొరక – 1/4 కప్పు
వెన్న – 2 tbsp
నూనె - 2 tsp
పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కూరగాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత అజినొమొటొ వేసి కలిపి, ఎండుమిర్చి, వెల్లుల్లి కలిపి నూరిన ముద్ద, టమాటా సాస్, సోయా సాస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్ది సేపు ఉడికించాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప తురుము, నూడుల్స్, వెన్న, సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. పావ్ బన్నును రెండుగా కట్ చేసుకుని వెన్న రాసి రెండు వైపులా కాల్చుకుని వేడి వేడి కూర/భాజి తో సర్వ్ చేయాలి. కావాలంటే కొంచం చీజ్ తురిమి వేయొచ్చు.