రక్తస్రావాన్ని అరికట్టడంలో “దానిమ్మ రసం”
పిల్లల్లో అప్పుడప్పుడు ముక్కునుంచి రక్తం కారుతుంటుంది. అయితే దానికేమీ గాబరా పడకుండా, వైద్యుని వద్దకు తీసుకెళ్లడానికి ముందుగానే నాసికా రంధ్రాల్లో కొన్ని చుక్కల దానిమ్మ రసం వేస్తే సరి. ఇలా చేసినట్లయితే వైద్యుడి వద్దకు వెళ్లేవరకూ రక్తస్రావం కాకుండా ఆపవచ్చు. అలాగే మీ చిన్నారులు డల్‌గా, నలతగా ఉన్నట్లు అనిపిస్తే.. అర గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి ఇస్తే సరిపోతుంది. తేనెలోని సహజసిద్ధమైన ఔషధ గుణాలు పిల్లల శరీరాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చివేస్తాయి.
పెద్దలకు దగ్గునుంచి ఉపశమనం లభించాలంటే… ఆవాలను పొడిచేసి కాసిన్ని నీళ్లుకలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టులో కాస్తంత తేనె కలిపి తీసుకుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్, టొమోటో, కప్పు నీళ్లు కలిపి గ్రైండ్ చేసి వడగట్టాలి. అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే రక్తవృద్ధి కలుగుతుంది.
దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడిచేసి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో పావు టీస్పూన్ దానిమ్మ పొడిని కలుపుకుని పరగడుపున తాగాలి. ప్రతిరోజూ ఇలా చేసినట్లయితే రక్తశుద్ధి అవుతుంది. మూత్ర సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.