ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TOMATO - NOW AVAILABLE IN DECEMBER PLENTY - SO USE AND CHECK STOMACH DISEASES - REDUCES CANCER


జీర్ణ కోశ సమస్యలకు “టొమోటో”లతో చెక్..!!

ప్రకృతి సహజంగా లభించే తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలను తీసుకోవటంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు తగిన మోతాదులో అందుతాయి. కూరగాయలలో ఒకటైన టొమోటోలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే.. జీర్ణాశయంలో అధికంగా తయారయ్యే ఆసిడ్లను నివారిస్తాయి. తద్వారా జీర్ణకోశ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
విటమిన్ సీ పరిమాణం అధికంగా ఉన్న టొమోటోలను ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల అజీర్తి సమస్యలను అరికట్టవచ్చు. అలాగే వీటిలో ఎక్కువగా లభించే ఏ, సీ విటమిన్లు కంటిచూపును మెరుగుపరచటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే టొమోటోలు దంతాలను దృఢపరచటంలో కూడా ఉపయోగపడతాయి.
టొమోటోలలో క్యాల్షియం, పాస్ఫరస్ లాంటి ఏడురకాల లవణాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరచటంలో, రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు సైతం టొమోటోలలో అధికంగా లభిస్తాయి. ఈ పిండి పదార్థలలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరచటంలోనూ, కాలేయంలోని క్రిములను నిర్మూలించటంలోనూ శక్తివంతంగా పనిచేస్తాయి.
మాంసకృత్తులు, ఐరన్, పొటాషియం, సోడియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరిన్, కాపర్‌లతోపాటు ఫోలిక్ ఆసిడ్, నియాసిన్, ఆక్సాలిక్ ఆసిడ్ లాంటి విటమిన్లు కూడా కలిగిన టొమోటోలు తిన్న రెండు గంటలలోపే జీర్ణమవుతాయి. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలోనూ, పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథికి క్యాన్సర్ సోకకుండా ఆపటంలోనూ టొమోటోలు చక్కగా పనిచేస్తాయి.