పాలు – నీళ్ళు
కథ వినండి
అనగా అనగా ఒక రాజు. ఆ రాజు గారికి తన అధికారం మీద చాలా నమ్మకం. తన శాసనాలను ప్రజలు తు. చ. తప్పకుండా పాటిస్తారని అనుకునే వాడు. మంత్రి మణివర్మ రాజు గారి నమ్మకాన్ని పరీక్షిద్దామని అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు.
ఒక రోజు రాజ్యంలో ఇలా దండోరా వేయించారు, “ఈ రోజు చీకటి పడిన తర్వాత, నగరంలోని ప్రజలందరూ రాజ భవనం ముందు ఉన్న కొలనులో ఒక కుండెడు పాలు పొయ్యవలసిందని రాజు గారి ఆజ్ఞ.”
ప్రజలకు రాజు గారి ఆజ్ఞ వింతగా తోచింది. ప్రతి ఒక్కరూ మనసులో, ” నగరంలో ప్రజలంతా రాజు గారికి భయపడి పాలు తెచ్చి పోస్తారు. నేను ఒక్కడినీ నీళ్ళు పోస్తే రాజు గారికి తెలియదులే. పాలలో నీళ్ళు కలిసిపోతాయి,” అనుకుని తలా ఒక కుండెడు నీళ్ళు తీసుకు వచ్చి కొలనులో పోశారు.
తెల్ల వారి రాజు గారు వచ్చి చూస్తే కొలను నిండా నీళ్ళే ఉన్నాయి, ఒక్క చుక్క కూడా పాలు లేవు!
|