కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు - 10, పాలు - అర లీటరు, క్రీమ్ - అర కప్పు
పంచదార - 1 కప్పు, నీళ్లు - అర కప్పు, కుంకుమ పువ్వు - చిటికెడు బాదంపప్పు - 10, నెయ్యి - అర కప్పు
తయారు చేసే విధానం
బ్రెడ్ ముక్కల అంచులు కత్తిరించుకోవాలి. వీటిని నేతిలో బంగారు రంగు వచ్చవరకు పెనం మీద వేయించాలి. పాలల్లో క్రీమ్ వేసి సగం అయ్యేవరకు మరిగించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. ఈ పాకాన్ని మరిగే పాలల్లో కలపాలి. ఒక స్పూన్ చల్లటి పాలల్లో కలిపి మరిగే పాలల్లో పొయ్యాలి. అందులోనే సన్నగా తరిగిన బాదం పలుకులు కలపాలి. వెడల్పు పాత్రలో వేయించిన బ్రెడ్ ముక్కలు పెట్టి పాల మిశ్రమాన్ని అందులో పొయ్యాలి. సన్న సెగమీద పాలన్నీ ఇంకిపోయే వరకు ఉంచాలి. అంతే రుచికరమైన బ్రెడ్ మిఠాయి తయార్.