ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

STRIM - TRIM - LATEST SLIM FASHION CLOTHES WEAR TIPS FOR TEENAGERS

నాజూకు వస్ర్తాలు


స్లిమ్‌గా ట్రిమ్‌గా ఉండాలనేది నేటి అమ్మాయిల కోరిక. ఫిట్‌నెస్‌ మీదా, ఆరోగ్యంతో పాటు అందం మీదా అందరి దృష్టి పడింది నేడు. స్లిమ్‌గా ఉన్నా, ఉండకపోయినా వస్త్రాల ఎంపికలో కొన్ని టిప్స్‌ పాటిస్తే స్లిమ్‌గా కనిపిస్తారని ఫ్యాషన్‌ డిజైనర్లు సెలవిస్తున్నారు. ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకుందామా...


పియర్‌షేప్‌ గలవారికి... ‚‚‚: శరీరాకృతి పైభాగం మామూలుగా ఉండి క్రింది భాగం చాలా హెవీగా ఉన్న యువతులు స్ట్రెయిట్‌కట్‌ జీన్స్‌ ఎక్కువగా ధరిస్తే వారు మరింత ఆకర్షణీయంగా కనబడతారు. సిగరెట్‌ కట్‌ ప్యాంట్‌కానీ, అలాంటిది కానీ ధరిస్తే కింది భాగం వికారంగా కనిపిస్తుంది. స్కర్ట్‌ల కోసం సాప్ట్‌ బట్ట ను అంటే క్రేప్‌, లైక్రా, కార్డ్‌రాయ్‌ వంటివి ఎంపిక చేసుకోవాలి. ఇవి హిప్స్‌ వద్ద ఫిట్‌గా ఉండి చక్కగా అమరుతాయి. ప్యాంట్‌, స్కర్ట్‌లను నాభికి కిందుగా ధరించాలి. కుచ్చులున్న స్కర్టులు ధరించాలి. పైన ధరించే టాప్‌లేదా కుర్తాల నెక్‌ లైన్‌ వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. అంటే బోన్‌నెక్‌, ఆఫ్‌ షోల్డర్‌ వం టివి ఎంపికచేసుకోవాలి. టాప్స్‌ ఎలాంటిది వేసుకోవాలంటే జనం దృష్టి దానిమీదే ఉండాలి. అందుకని టాప్‌ మీద రెండు రంగుల ఎంబ్రాయిడరీలు లేదా భుజానికి స్మోకీ డిజైన్‌ చేయించుకోవాలి. ఎంపైర్‌ లైన్‌ ఉన్న డ్రెస్‌ను సైతం వేసుకోవచ్చు. కుర్తా పొడవును, కాళ్ళ ఆకారాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఒకే ఫ్యాబ్రిక్‌తో తయారైన రెండు షేడులున్న వస్త్రాలు ధరించాలి. ఉదాహరణకు నీలం, పచ్చ వంటివి. ఒక్క సారిగా పలురంగుల బట్టలు వేసుకుంటే జనం దృష్టి హిప్స్‌ మీదకు వెళుతుంది. 


షేప్‌ శరీరం వారికి... : శరీర పైభాగం హెవీగా ఉంటే ఆపిల్‌షేప్‌ శరీరం ఉన్నట్టు లెక్క. సిగరెట్‌ లేదా స్లిమ్‌ ప్యాంట్‌ వేసుకుంటే జనం దృష్టి నేరుగా పలుచని కాళ్ళమీదకు వెళుతుంది. అం దుకని ఇలాంటివి వేసుకోకూడదు. కుచ్చులూ, వెయిస్ట్‌బ్యాండ్‌, జేబులూ లేనటువంటి సింపుల్‌ ప్యాంట్‌ వేసుకోవాలి. పెన్సిల్‌ స్కర్ట్‌ వేసుకుంటే పొడవుగా ఉన్నట్టు కనిపిస్తారు. పెద్ద సైజులున్న టా ప్స్‌, కుర్తాలు వేసుకోకూడదు. ఒం టికి అతుక్కుపోయే బట్టతో త యారుచేసిన టాప్స్‌ వేసుకో కూడదు. అలా చేస్తే ఇంకా స్థూలంగా ఉన్నట్టు కనిపిస్తారు. హిప్స్‌ను మూసేటు వంటి, మోకాళ్ళ కిం దుగా ఉండే కుర్తాలు ధరించాలి. వీ షేప్‌ గల వీ, వెడల్పు మెడ గలవీ అయిన కుర్తాలు శరీరం పైభాగాన్ని స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి.


మధ్యస్థ శరీర నిర్మాణం గలవారికి... : శరీరం సరైన స్థూలతతో ఉండేవారు అదృష్టవంతులే. ఇలాంటి వారు శరీరం తాలూకు అందాన్ని ద్విగుణీకృతం చేసే వస్త్రాలు ధరించవచ్చు. చేతుల టోన్‌ సరిగ్గా ఉంటే చేతులు లేని షర్ట్‌ వేసుకోవచ్చు. ఫిట్టింగ్‌ గల వస్త్రాలు వేసుకుంటే స్లిమ్‌గా కనిపిస్తారు. టాప్స్‌, కుర్తాల విషయంలో విభిన్నమైన ప్రింట్స్‌ గల వస్త్రాలతో ప్రయోగాలు చేయవచ్చు. ఈ శరీరాకృతి గలవారు ఎక్కువ నగలు ధరించకూడదు. కేవలం చెవులకు ఏదైనా పెట్టుకోకచ్చు. 


అతి స్థూలకాయులకు... : ట్రౌజర్‌, స్కర్ట్‌ లేదా జాకెట్‌ ఏదైనా సరే సరైన కట్స్‌తోను, ఫిట్టింగ్స్‌తోనూ ఉండాలి. బాగా ముదురు రంగున్న సింగిల్‌ షర్టు వేసు కుంటే సన్నగా కనిపిస్తారు. తెల్లని షర్టు చక్కని లుక్‌ను కలుగజేస్తుంది. చిన్న చి న్న ప్రింట్లున్న బట్టలు సన్నగా కనిపించేలా చేస్తాయి. నగల విషయంలో వీరికీ నిషేధమూ లేదు. సున్నితమైన నగలు ధరించవచ్చు. చెవులకూ, మెడకు పెద్ద ఆభరణాలు పెట్టుకోవచ్చు.