మలబద్ధకాన్ని తగ్గించే... తిర్యక్ కటి చక్రాసనం
ఒబేసిటీిని, మలబద్ధకాన్ని తగ్గించడానికి ఈ తిర్యక్ కటి చక్రాసనం బాగా తోడ్పడుతుంది.
చేసే విధానం : మొదట తాడాసనంలో నిలబడి గాలిని తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులనూ పూర్తిగా పైకి లేపాలి. తర్వాత రెండు చేతుల వేళ్లను కలిపి ఉంచాలి. శరీరాన్ని పై నుంచి నముడు వరకు కుడివైపునకు తిప్పాలి. గాలిని వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని నడుము వరకు 90 శాతం ముందుకు వంచాలి. రెండు చెవులకు రెండు భుజాలు తగిలిస్తూ ఉండాలి. ఈ స్థితిలో కొంత సమయం ఉండాలి. తర్వాత నెమ్మదిగా గాలి తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. తర్వాత గాలిని వదులుతూ చేతులను కిందికి దించాలి. తర్వాత తాడాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే ఎడమ వైపూ చేయాలి.
ప్రయోజనాలు :
ఒబేసిటీని తగ్గించే యోగాసనాలలో తిర్యక్ కటిచక్రాసనం ఒకటి. నడుము దగ్గర ఉన్న కొవ్వును కరిగిస్తుంది. నడుము నొప్పిని ఈ ఆసనం చెయ్యడం ద్వారా తగ్గించుకోవచ్చు. మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, లివర్, కిడ్నీలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. భుజం, నడుముకు సంబంధించిన కండరాలు బలపడతాయి. స్త్రీలలో యుటరస్, ఓవరీస్‌కు సంబంధించిన సమస్యలు, పురుషులలో ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన సమస్యలను తొలగించుకోవచ్చు.